తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో దారుణం - భార్యను హత్య చేసి కనిపించట్లేదని భర్త నాటకం

Husband Killed Wife in Hyderabad : కాపాడాల్సిన భర్తే కాలయముడిలామారి ఆమెను దారుణంగా హతమార్చాడు. అంతేకాకుండా భార్య కనిపించడం లేదని కొత్త నాటకానికి తెరలేపాడు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూడటంతో నిందితుడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 1:00 PM IST

Husband Killed Wife in Hyderabad :కూతుర్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడని అతనికిచ్చి వివాహం చేశారు. కష్టాల్లో తోడుగా ఉంటానని పెళ్లినాడు ఆ వ్యక్తి బాసలు చేశాడు. పెళ్లి నాటి ప్రమాణాల్లో ఏడు అడుగులు వేసి జీవితాంతం నీ వెంటే నేను అని అన్నాడు. అలా 18 ఏళ్ల పాటు సాఫీగా సాగింది వారి వైవాహిక జీవనం. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు కుమారులు జన్మించారు. అంతా హాయిగా సాగుతుందనుకుంటుండగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు తలెత్తాయి.

అవి కాస్త రోజురోజుకు పెరిగిన వివాదం ముదిరింది. ఈ క్రమంలో అతను ఎలాగైనా భార్యను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఓ ఫంక్షన్‌కి వెళ్లాలని ఆమెను తీసుకెళ్లి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకొని భార్య కనిపించడం లేదని కొత్త నాటకానికి తెర లేపాడు. ఇది నిజమేనని నమ్మిన మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో (Husband Killed Wife) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్‌ఐ గిరీష్‌ వెల్లడించారు.

బ్యూటీపార్లర్​లో భార్యను చంపి.. మెడలో పూలదండలు వేసి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : "నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ వాసి రాజేశ్వరి(38)కి, అదే జిల్లాకు చెందిన రుద్రూరు మండల కేంద్రానికి చెందిన కార్పెంటర్‌ రాజేశ్‌తో 2005లో వివాహమైంది. వీరికి 17, 18 ఏళ్ల ఇద్దరు కుమారులున్నారు. పిల్లలిద్దరూ రాజేశ్వరి తల్లి వద్ద బోధన్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. నిందితుడు బతుకుదెరువు కోసం మియాపూర్‌ వచ్చి ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. భార్య అడ్డు తొలగించుకోవాలని రాజేశ్‌ భావించాడు. ఈనెల 10న గండిమైసమ్మ ప్రాంతంలో ఓ ఫంక్షన్‌ ఉందని ఆమెను బైకుపై తీసుకెళ్లాడు. బౌరంపేట సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు సర్వీస్‌ ప్రాంతానికి రాజేశ్వరిని తీసుకెళ్లి, తలపై రాయితో కొట్టి రాజేశ్ హత్యచేశాడు." సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు.

Husband Killed Wife in Hyderabad Today : నాగోల్​లో దారుణం.. భార్యను కత్తితో పొడిచి హత్య.. ఆపై భవనం నుంచి దూకి భర్త ఆత్మహత్య

రాజేశ్వరి కనిపించడం లేదని నాటకం : రాజేశ్వరి మృతదేహాన్ని సర్వీస్‌ రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడేసి, రాజేశ్‌ ఇంటికి చేరుకున్నాడని సీఐ ప్రేమ్‌కుమార్ వివరించారు. అనంతరం ఈనెల 12న మృతురాలి తల్లి, సోదరికి ఫోన్‌ చేసి రాజేశ్వరి కనిపించడం లేదని, నిందితుడు నాటకం మొదలుపెట్టాడని చెప్పారు. మృతురాలి తల్లి 14న మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. దర్యాప్తులో భాగంగా రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య వ్యవహారం వెలుగు చూసిందని అన్నారు. మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని రాజేశ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ప్రేమ్‌కుమార్ వివరించారు.

భార్యపై అనుమానం.. సుత్తితో కొట్టి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందటే!!

husband killed his wife: భార్యను ముక్కలుగా నరికి.. నగ్నంగా మార్చేసి..!

ABOUT THE AUTHOR

...view details