Husband Killed Wife in Hyderabad Today : హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో రాజు, సంతోషి(35) దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఒక అమ్మాయి.. అబ్బాయి ఉన్నారు. వీరి స్వస్థలం మహబూబ్ నగర్‌లోని ఆమనగల్ సమీపంలోని ఆకుతోటపల్లి. దంపతుల ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. ఇవాళ తన భార్యను రాజు దారుణంగా పొడిచి చంపేశాడు. అనంతరం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తపోవన్ కాలనీలో తన సోదరి ఇంటికి వెళ్లి.. భవనం మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చేసుకున్నాడు.
husband killed his wife: భార్యను ముక్కలుగా నరికి.. నగ్నంగా మార్చేసి..!