అసోం రాష్ట్రం తేజ్‌పూర్ జిల్లా పోస్కో గ్రామానికి చెందిన సంతోష్ చౌహాన్, దీపాలి చౌహాన్ దంపతులు... చిన్న చర్లపల్లిలోని వెంకట్రెడ్డినగర్ కాలనీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. సంతోష్ చౌహాన్ చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలు, అనుమానంతో భార్యతో సంతోష్ తరుచూ గొడవపడుతూ ఉండేవాడు.
'భార్యను చంపేసి... ఆత్మహత్యగా చిత్రీకరించి' - భార్యను చంపిన భర్త
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై దాడిచేసి గొంతు నులిమి హతమార్చిన భర్త ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఈ ఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది.
'భార్యను చంపేసి... ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు'
గురువారం అర్ధరాత్రి డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సంతోష్ పట్కార్‌తో భార్యపై దాడిచేసి గొంతునులిమి హత్య చేశాడు. ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించే యత్నం చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి:ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?: హైకోర్టు