తెలంగాణ

telangana

ETV Bharat / state

వివాహేతర సంబంధంతో అడ్డంగా దొరికిపోయిన భర్త - husbend

ఓ భర్త మరో వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్తపై భార్య దాడి చేసి రెడ్​ హ్యాండెడ్​గా ​ పట్టుకున్న ఘటన హైదరాబాద్​ కూకట్​పల్లిలో జరిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ అదే ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది.

విహహితపై దాడి చేస్తూ

By

Published : Jul 25, 2019, 10:04 AM IST

Updated : Jul 25, 2019, 1:08 PM IST

మంచిర్యాల జిల్లా కొత్త కొమ్ముగూడెంకు చెందిన సౌజన్య, లక్ష్మణ్​ దంపతులు హైదరాబాద్ కూకట్​ల్లిలోని ప్రగతి నగర్​లో ఉంటున్నారు. వీరికి ఒక బాబు ఉన్నారు. లక్ష్మణ్​ ఓ వివాహితతో గత కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఇందుకు సంబంధించి సౌజన్య వద్ద ఫొటోలు ఉండడం వల్ల పెద్దల ముందు భర్తను నిలదీసింది. అవి గతంలో దిగిన ఫొటోలని లక్ష్మణ్​ చెప్పాడు. కానీ లక్ష్మణ్​ ప్రగతినగర్​లో ఓ ఇంట్లో ఆ వివాహితతో కలిసి ఉంటున్నారని గమనించిన సౌజన్య ఆ ఇంట్లోకి వెళ్లి భర్తతోపాటు ఉన్న మహిళను రెడ్​ హ్యాండ్​గా పట్టుకుంది. ప్రియురాలికి గతంలో ఓ వ్యక్తితో పెళ్లి అయింది. బాబు కూడా ఉన్నాడు. ఆమె భర్తకు దూరంగా ఉంటోంది.

వివాహేతర సంబంధంతో అడ్డంగా దొరికిపోయిన భర్త
Last Updated : Jul 25, 2019, 1:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details