హైదరాబాద్ నాంపల్లిలో మోనేశ్ అనే వ్యక్తి కొన్ని నెలలుగా.. తన భార్య కళావతితో సహజీవనం చేస్తున్నాడని భర్త మహేశ్.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు గత నెల ఫిర్యాదు చేశాడు. బుధవారం కేసు విచారణ ఉండగా... కళావతి కమిషన్ ముందు హాజరైంది. ఆమెతోపాటు మోనేశ్ కూడా కమిషన్ కార్యాలయానికి హాజరయ్యాడు.
గతంలో వివాహమైనా..
అయితే మోనేశ్కు శాంతి అనే మహిళతో గతంలోనే వివాహమైంది. కొన్ని రోజులుగా భర్త ఇంటికి రాలేదని... ఇవాళ కమిషన్కు వస్తున్నాడని తెలుసుకుని శాంతి నాంపల్లి చేరుకుంది. కార్యాలయ ప్రాంగణంలో భర్తను నిలదీసింది. కోపోద్రిక్తుడైన మోనేశ్.. భార్య శాంతిపై దాడి చేయగా అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు.