తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తులో భార్య తలపై డంబెల్స్ తో కొట్టిన భర్త

మద్యం మత్తులో ఉన్న భర్త... భార్య తలపై డంబెల్స్​తో కొట్టి గాయపరిచిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సంచలనం సృష్టించింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు... ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు... హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

మద్యం మత్తులో భార్య తలపై డంబెల్స్ తో కొట్టిన భర్త
మద్యం మత్తులో భార్య తలపై డంబెల్స్ తో కొట్టిన భర్త

By

Published : Sep 10, 2020, 11:06 PM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో నివాసముంటున్న శ్రీను, మాధవి... ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. శ్రీను ఆర్​టీసీ డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి మద్యపానం అలవాటు ఉంది. మద్యం తాగి వచ్చి రోజూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. ఈ ఘటనపై మాధవి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఇతర కారణాలతో కేసును ఉపసంహరించుకుంది. అయిప్పటికీ శ్రీనులో మార్పు రాలేదు.

ఈ క్రమంలో ఈనెల 4న శ్రీను... మద్యం మత్తులో మాధవి తలపై డంబెల్​తో కొట్టాడు. గమనించిన స్థానికులు తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా... అంతగా స్పందించలేదని బాధితురాలి కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి తీరును తప్పుబడుతూ.. అతని ప్రవర్తనను వివరించింది.

ఇదీ చూడండి: ఓ రైతుకు పొలంలో కనిపించిన వింత తాబేలు

ABOUT THE AUTHOR

...view details