యాస్ తుపాను తూర్పు మధ్య, ఉత్తర బంగళాఖాతంలో కొనసాగుతూ పారదీప్‌కి దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి మరింత తీవ్రతతో బలపడి రాగల 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఇది చాంద్‌బలి-ధర్మా పోర్టులకు దగ్గరగా ఈనెల 26 తెల్లవారుజామున చేరుకుంటుందని పేర్కొన్నారు.
రాగల 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా 'యాస్' - Hyderbabad weather report
రాగల 12 గంటల్లో యాస్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. ఇది చాంద్‌బలి-ధర్మా పోర్టులకు దగ్గరగా ఈనెల 26 తెల్లవారుజామున చేరుకుంటుందని పేర్కొన్నారు.
rain
ఇది అదే రోజు అంటే మే 26న సుమారు మధ్యాహ్నం ఉత్తర ఒడిశా పశ్చిమ బంగాల్ తీరాలను, పారదీప్-సాగర్ ఐలాండ్ల దగ్గరగా ధర్మా పోర్టుకి ఉత్తరంగా దక్షిణ బలాసోర్కి దగ్గరగా అతి తీవ్ర తుపానుగా తీరాన్ని దాటే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. వీటి ప్రభావంతో ఈరోజు బలమైన కింది స్థాయి గాలులు వాయువ్య ఉత్తర దిశల నుంచి తెలంగాణ మీదకు వీస్తున్నాయన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాల్లో ఈరోజు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించారు.
Last Updated : May 25, 2021, 4:59 PM IST