కార్పొరేటర్‌గా గతంలో చేసిన అభివృద్ధి పనులే మళ్లీ తనను గెలిపిస్తాయని జూబ్లీహిల్స్ తెరాస అభ్యర్థి కాజా సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. తన హయాంలో మంచినీరు, రహదారులు, విద్యుత్ సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు.
సూర్య నారాయణకు మద్దతుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఎఫ్ఎన్సీసీలో సినీ ప్రముఖులతో సమావేశం ఏర్పాటుచేశారు. కేఎస్ రామారావు, అశోక్‌కుమార్, అది శేషగిరిరావు సహా పలువురు దర్శక నిర్మాతలు, ఫిల్మ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.