తెలంగాణ

telangana

ETV Bharat / state

Humanist: స్విగ్గీ, జొమాటో ద్వారా అన్నార్థులకు భోజనం పంపిణీ - Swiggy

రోజుల తరబడి అన్నదానం (food distribution) చేయడమంటే.. అనుకున్నంత సులవైన పనేం కాదు. ప్రతి రోజు అదే దినచర్యగా కొనసాగించడమనేది సాహసోపేతమైన నిర్ణయమే. హైదరాబాద్​కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం.. ఏడాదిగా అన్నదానం నిర్వహిస్తూ ఆపత్కాలంలో పేదలకు అండగా నిలుస్తోంది. ఆకలితో అలమటిస్తోన్న వందలాది మందికి భోజనం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటోంది.

humanitarian distributing meals
భోజనం పంపిణీ

By

Published : May 31, 2021, 7:19 PM IST

కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో.. ఆకలితో అల్లాడిపోతున్న అన్నార్థులను ఆదుకునేందుకు వేదం ఫౌండేషన్ ముందుకొచ్చింది. గతేడాది లాక్​డౌన్​లో నగరంలోని వివిధ ఆసుపత్రుల వద్ద.. రోగులకు, వారి కుటుంబ సభ్యులకు భోజనాన్ని అందించి (food distribution) మానవత్వాన్ని చాటుకున్న సంస్థ వ్యవస్థాపకులు అరవింద్.. రెండో దశ లాక్​డౌన్​లోనూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. యూసఫ్ గూడలోని ఓ కిచెన్​ను అద్దెకు తీసుకొని ప్రతిరోజు దగ్గరుండి ఆహారాన్ని తయారు చేయించి.. పంపిణీ చేస్తున్నారు. రోజుకు సుమారు 2 వేల మంది ఆకలి తీరుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

స్విగ్గీ, జొమాటో ద్వారా..

అరవింద్.. 15 రోజులుగా గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల వద్ద బాధిత కుటుంబాలకు రెండు పూటల నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. కూకట్ పల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, అమీర్ పేట ప్రాంతాల్లోని 350 మంది కొవిడ్ బాధితులకు.. స్విగ్గీ(Swiggy), జొమోటో(Zomato) ద్వారా ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. లాక్​డౌన్ కారణంగా ఆహారం కోసం ఇబ్బంది పడుతోన్న ఆర్టీసీ కార్మికులకూ అండగా నిలుస్తున్నారు. లాక్​డౌన్ కొనసాగినంత కాలం.. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని అరవింద్ అంటున్నారు.

అన్నార్థులకు అండగా..

ఇదీ చదవండి:కరోనాతో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురి మృత్యువాత

ABOUT THE AUTHOR

...view details