హైదరాబాద్, మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు భారీ స్పందన లభిస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో..ఆయా మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వెళ్లే ప్రధాన మార్గాల్లో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Vaccine Drive: మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌కు భారీ స్పందన... ట్రాఫిక్ జామ్ - సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్‌లో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతోన్న ఈ డ్రైవ్‌లో.. నేడు ఒక్కరోజే 40 వేల మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. అయితే పెద్ద ఎత్తున తరలివస్తోన్న జనాలతో ఆయా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Madhapur vaccination drive
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనాలను క్లియర్ చేస్తున్నారు. డ్రైవ్‌లో ఒక్కరోజే 40 వేల మందికి వ్యాక్సిన్ వేయనుండటంతో.. ప్రజలంతా ఒక్కసారిగా సెంటర్‌కి తరలివస్తున్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, పోలీసులు, మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా పంపిణీ కొనసాగుతోంది.
ఇదీ చదవండి:Vaccine Drive : మహానగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్