Huge response from book lovers: హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌లో, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాల్ పుస్తక ప్రియులను ఆకట్టుకుంటోంది. జూలూరు గౌరి శంకర్ రాసిన జీవధార, తెలంగాణ విజయ గాథ, ఆత్మబంధువు, ఒక్కగాన్కోడు పుస్తకాలు ఉన్నాయి. పెద్దూరి వెంకటదాసు రచించిన తెలంగాణ కేసరి, కన్నోజు మనోహర చారి రచించిన తెలంగాణ అభ్యుదయం దేశానికి మహోదయం, మనోహర చిమ్మని రచించిన కేసీఆర్ ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్, తినేత్రి రచించిన దటీజ్ కేసీఆర్ పుస్తకాలు ప్రియులకు,విద్యార్ధులను ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి స్టాల్‌కు బుక్ ఫెయిర్‌లో భలే గిరాకీ - హైదరాబాద్ తాజా వార్తలు
Huge response from book lovers: హైదరాబాద్ దోమల్‌గూడలోని ఎన్టీఆర్ మైదానంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఏర్పాటు చేసిన జాతీయ పుస్తక ప్రదర్శనశాలలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై పలువురు రచయితలు రాసిన పుస్తకాలకు విశేష స్పందన వస్తోంది. ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై అనేక పుస్తకాలు పుస్తక ప్రియులు, పోటీపరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు అసక్తిగా పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.
బుక్ ఫెయిర్
దీంతో పాటు ఉద్యమ ప్రస్థానం, పాలన, ప్రభుత్వ పథకాలు పుస్తకాలు కూడా పుస్తక ప్రియులకు అందుబాటులో ఉన్నాయి. శనివారం వారంతం కావడంతో పాటు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో బుక్ ఫెయిర్‌ను పుస్తకాభిమానులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు.
ఇవీ చదవండి :