తెలంగాణ

telangana

ETV Bharat / state

Tirumala Sarva Darshan tokens: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసిన తితిదే

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తితిదే జారీ చేసింది (Srivari Sarva Darshan tokens). శ్రీనివాసం కాంప్లెక్స్‌లో టోకెన్లును అధికారులు జారీ చేశారు. సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రాత్రి నుంచే టోకెన్ల జారీచేశారు.

huge-number-of-devotees-wait-in-line-to-get-free-tokens-in-tirumala
huge-number-of-devotees-wait-in-line-to-get-free-tokens-in-tirumala

By

Published : Sep 21, 2021, 10:30 AM IST

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల(Srivari Sarva Darshan tokens)ను శ్రీనివాసం కాంప్లెక్స్‌లో వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం(ttd news) అధికారులు జారీ చేశారు. ఉదయం 5 గంటల వరకు 8 వేల టోకెన్లు జారీచేసినట్లు తితిదే వెల్లడించింది. సర్వదర్శనం టోకెన్ల కోసం (ttd tokens) భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రాత్రి నుంచే టోకెన్ల జారీచేశారు. రేపటి టోకెన్లు ఇవాళ సాయంత్రం జారీచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

టోకెన్లు జారీ చేసే శ్రీనివాసం వద్ద ఫుట్‌పాత్‌పై భక్తులు బారులు తీరారు. రోజుకు 8 వేల టోకెన్లు మాత్రమే జారీ చేస్తామని తితిదే వెల్లడించింది. పెరటాసి మాసం కావడం.. మరోపక్క సర్వదర్శనం టికెట్ల సంఖ్య పెంచుతూ తితిదే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

సోమవారం తిరుమల శ్రీవారిని 31,558 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.77 కోట్లు రాగా.. 14,247 మంది భక్తులు.. తమ తలనీలాలు సమర్పించకున్నారు.

ఇదీ చూడండి:అక్టోబర్ 7 నుంచి ఏకాంతంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details