విశాఖలోని ప్రమాదంపై ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లోకి దిగారని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. "ఎల్.జీ పాలిమర్స్ సౌత్‌కొరియా కంపెనీ. లాక్‌డౌన్ నుంచి పరిశ్రమలకు మినహాయింపు తర్వాత తిరిగి ప్రారంభించారు. సుమారు 3గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టెరైన్ వాయువు లీకైంది. 4.30గంటలకు మాకు సమాచారం అందింది. లీకైన గ్యాస్ వల్ల ప్రాణ నష్టం ఉండదు."
300 మంది అస్వస్థతకు గురయ్యారు: విశాఖ కలెక్టర్ - lpg Polymers industry
ఆంధ్రప్రదేశ్ విశాఖలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ ప్రమాదంలో సుమారు 300 మంది అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
"స్పృహతప్పి పడిపోవడం ఈ గ్యాస్ సహజ లక్షణం. నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆక్సిజన్ ఇస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 300 మంది వరకు అస్వస్థతకు గురై ఉంటారని అంచనా వేస్తున్నాం. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను ఈ ప్రాంతం నుంచి కొత్త ప్రదేశానికి తీసుకెళ్తే వెంటనే రికవరీ అవుతారు. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం" అని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.