హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. సుష్మా థియేటర్ ఎదురుగా ఉన్న మారుతీ టైర్ రీట్రేడింగ్ గోదాంలో సంభవించిన ఈ ప్రమాదంలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. టైర్లు తగలబడుతుంటం వల్ల ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండు అగ్నిమాపక శకటాలతో 3 గంటల నుంచి మంటలర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా... ఫలితమేమీ కన్పించటం లేదు. పెద్ద ఎత్తున వస్తోన్న మంటలు పక్క అపార్టుమెంటుకు వ్యాపిస్తున్నాయి. స్థానికులందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వనస్థలిపురంలోని టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం - వనస్థలిపురంలోని టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం..
పండుగ వేళ హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందిరానగర్‌లోని ఓ టైర్ రీట్రేడింగ్ గోదాంలో జరిగిన ఈ ప్రమాదంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మూడు గంటలైన అగ్నికీలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. దుర్వాసన, పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. మంటలు పక్క ఇళ్లకు కూడా వ్యాపిస్తున్నాయి.
HUGE FIRE ACCIDENT IN TYRE GODOWN AT VANASTHALIPURAM
Last Updated : Oct 27, 2019, 8:38 PM IST