Huge donation sbi: హైదరాబాద్ బంజారాహిల్స్ స్పర్శ్ హాస్పిస్ స్వచ్ఛంద సంస్థకు ఎస్బీఐ భారీ విరాళం అందించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.3.13కోట్ల చెక్కును విరాళంగా ఇచ్చారు. బంజారాహిల్స్ రోటరీ క్లబ్ ఛారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో హాస్పిస్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తుంది. క్యాన్సర్ వ్యాధికి గురై చివరి దశకు చేరుకున్న 170 మంది పేదలకు సేవలు అందిస్తున్నారు.
ఈ సేవలను మరింత విస్తరించేందుకు రోగుల ఇంటివద్దే సేవలు అందించేందుకు ఈ డబ్బును వినియోగించాలని ఓం ప్రకాష్ మిశ్రా కోరారు. మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసుకుని మల్టీ డిసిప్లేనరీ టీమ్స్ నియమించుకుని సంస్థ సేవలు కొనసాగించాలని ఆయన సూచించారు.