ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రవాస భారతీయ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్ల విరాళం అందజేశారు. విరాళం చెక్కును అజ్ఞాత భక్తుడి తరఫున కుటుంబసభ్యులు శనివారం ఆలయ ఈవో ఎ.వెంకటేష్‌కు అందజేశారు. ప్రస్తుతం ఉన్న స్వామివారి ఆలయం పురాతనమైనది కావడంతో పునర్నిర్మాణానికి రూ.8.75 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు.
కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి రూ.7 కోట్ల విరాళం - kanipakam temple eo latest news
శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ.7 కోట్ల విరాళం చెక్కును ఆలయ ఈవోకు భక్తుడి కుటుంబ సభ్యులు అందజేశారు. ఆలయం పునర్నిర్మాణానికి ఈ భారీ మొత్తాన్ని అందజేసినట్లు ఆధికారులు తెలిపారు.
కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి రూ.7 కోట్ల విరాళం
ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చేందుకు ప్రవాస భారతీయ అజ్ఞాత భక్తుడు ముందుకొచ్చారు. శనివారం మొదటి విడతగా రూ.7కోట్ల చెక్కును ఆలయ ఈవోకు అందజేశారు. మిగిలిన నిధులను ఆ భక్తుడే సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:హైదరాబాద్ రైతు వెంకట్‌రెడ్డిపై మోదీ ప్రశంసల జల్లు