మొక్కలు పెంచాలనుకుంటే విశాలమైన ప్రదేశం ఉండాలని ఒకప్పుడు అనుకునేవారు. కానీ టెర్రస్ గార్డెన్, ఇండోర్ ప్లాంట్స్ వంటివి అందుబాటులోకి వచ్చాక చాలామంది పచ్చదనంపై ప్రత్యేక ఆసక్తి కనబర్చుతున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది మొక్కల పెంపకంపై(Gardening plants for home) ఆసక్తి చూపుతున్నారు. పిల్లలు, పెద్దలతో పాటు యువత కూడా గార్డెనింగ్పై(Gardening plants for home) ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇందుకు తగినట్లుగానే వైవిధ్యభరితమైన మొక్కలు అందుబాటులోకి వస్తున్నాయి. రెగ్యులర్ ప్లాంట్స్ కాకుండా విభిన్న ఆకారాల్లోనూ పెంచుతున్నారు. అంతేకాదు దేవుడి రూపంలోనూ మొక్కలు పెంచడం గమనార్హం.
నర్సరీల్లో వివిధ టెక్నిక్స్ ఉపయోగించి మొక్కలను వివిధ ఆకారాల్లో పెంచుతున్నారు. ఇక్కడ చూస్తున్నది పచ్చని శివలింగం అనుకుంటే పొరబడినట్లే. బోర్డర్ మొక్కలను శివలింగం ఆకారంలో పెంచారు. పుణెలోని ఓ నర్సరీలో ఈ శివలింగం మొక్కలను పెంచుతున్నారు. వీటికి ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. అందుకే నర్సరీ యజమానులు వీటిని పుణె నుంచి ప్రత్యేకంగా తెప్పించి... విక్రయిస్తున్నారు. అయితే ఈ మొక్కలను కొనడానికి నగరవాసులు సైతం బాగా ఆసక్తి కనబర్చుతున్నారని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక రేటు విషయానికి వస్తే మొక్కను బట్టి రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్ముతున్నామని తెలిపారు.