ఖైరతాబాద్‌లోని శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి (Rudra Maha Ganapati) దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో గణపతిని దర్శించుకున్నారు. కుటుంబాలతో వచ్చేవారు, పిల్లలు, పెద్దలు భారీగా వస్తుండడంతో గణేశ్ మండప పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు.
khairathabad: ఖైరతాబాద్ గణపతి మండపం వద్ద భక్తుల కిటకిట - ఖైరతాబాద్ గణేశుని వద్ద భారీగా భక్తులు
ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జంట నగరాల నుంచే గాక.. శివారు ప్రాంతాలు, సమీప జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Khairathabad
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం, అధికారులు, ఉత్సవ సమితి ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. వినాయకుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి:వచ్చే ఏడాది నుంచి మండపంలోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం