గడిచిన 24 గంటల్లో ఏపీలో 63,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,461 కరోనా కేసులు నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు. వైరస్ నుంచి మరో 2,113 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 18,882 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్‌తో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు.
corona cases: ఏపీలో కొత్తగా 1,461 కరోనా కేసులు, 15 మంది మృతి - ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వార్తలు
ఏపీలో కొత్తగా 1461 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారికి మరో 15 మంది బలయ్యారు. మరో 2,113 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 18,882 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.
huge-corona-cases-registered-in-last-twenty-four-hours-in-andhrapradhesh
పశ్చిమగోదావరి జిల్లాలో 235, కృష్ణా జిల్లాలో 210, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 195 చొప్పున, గుంటూరు జిల్లాలో 182, ప్రకాశం జిల్లాలో 112, తూర్పుగోదావరి జిల్లాలో 98, విశాఖ జిల్లాలో 74, కడప జిల్లాలో 59, శ్రీకాకుళం జిల్లాలో 41, అనంతపురం జిల్లాలో 28, విజయనగరం జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: