హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో డ్రైనేజీ, మ్యాన్‌హోల్స్ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. ఈ రోజు జంట నగరాల్లో కాల్‌సెంటర్, వెబ్‌సైట్, డయల్ 100, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా 279 ఫిర్యాదులు అందాయని బల్దియా అధికారులు వెల్లడించారు.
వర్షం సమస్యలపై బల్దియాకు భారీ ఎత్తున ఫిర్యాదులు - బల్దియాకు భారీ ఎత్తున ఫిర్యాదులు
ఒకవైపు నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతుంటే మరోవైపు సమస్యల వరద పారుతోంది. జంట నగరాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రజల నుంచి ఫిర్యాదులు వరదలా వస్తున్నాయి. వివిధ మార్గాల ద్వారా నగరంలో డ్రైనేజీ సమస్యలపై రోజుకు వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
బల్దియాకు భారీ ఎత్తున ఫిర్యాదులు
వీటిలో అత్యధికంగా డ్రైనేజీ ఓవర్ ఫ్లో పైనే ప్రజలు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. పలు చోట్స్ మ్యాన్‌హోల్స్ తెరిచి ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. వీటిలో కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కారం కాగా, అధిక శాతం పెండింగ్‌లో ఉంటున్నాయి.