కేంద్రం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ఏ మతానికి వ్యతిరేకం కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. భారత పౌరులకు ఆ చట్టంతో సంబంధమే లేదన్నారు. పాక్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు తీసుకువచ్చిన చట్టమని స్పష్టం చేశారు.
సీఏఏకు మద్దతుగా భారీ సభ... అమిత్ షాకు ఆహ్వానం: లక్ష్మణ్
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా విపక్షాలు రాజకీయ దురుద్ధేశ్యంతో మతం రంగు పులుముతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఏజెండాతో దూసుకుపోతున్న మోదీని నిలవరించలేక చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
సీఏఏకు మద్దతుగా హైదరాబాద్‌లో భారీ సభ
సీఏఏపై తెలంగాణలోని ప్రతి ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని లక్ష్మణ్ తెలిపారు. సీఏఏకు మద్దతుగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. ఆ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని చెబుతున్న లక్ష్మణ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి :బస్వాపూర్ గుట్టపై ఏకే-47తో రాత్రంతా..
Last Updated : Feb 13, 2020, 7:37 PM IST