తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ రాకకు భారీ ఏర్పాట్లు.. రూ.15వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన - మోదీ విశాఖ సభ కోసం విస్తృత ఏర్పాట్లు

PM Modi Visakhapatnam tour : ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ భద్రతలో కేంద్ర, రాష్ట్ర బలగాలన్నీ కలిపి దాదాపు పదివేల నిమగ్నమైయ్యారు. నేటీ పర్యటనలో ప్రధాని సుమారు 15 వేల 233 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని లేదా రైల్వే మంత్రి.. రైల్వే జోన్ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో విశాఖ వాసులతో పాటు రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

PM Modi Visakhapatnam tour
PM Modi Visakhapatnam tour

By

Published : Nov 11, 2022, 2:04 PM IST

మోదీ రాకకు భారీ ఏర్పాట్లు

PM Modi tour in AP: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు మూడు లక్షల మంది జనం బహిరంగ సభ హాజరవుతారనే అంచనాలతో అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలకు చెందిన దాదాపు పదివేల మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు సిద్ధం చేస్తున్నారు.

PM Modi AP Tour : విశాఖపట్నం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. సుమారు 15 వేల 233 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పాతపట్నం నుంచి నరసన్నపేట మధ్య రెండు లైన్ల రహదారిని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. తూర్పు తీరంలో 2917 కోట్లతో అభివృద్ధి చేసిన ఓఎన్జీసీ యూ ఫీల్డ్‌, 385 కోట్ల రూపాయలతో గుంతకల్లులో ఐఓసీఎల్ చేపడుతున్న గ్రాస్ రూట్ డిపో నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు రైల్వే లైన్, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నర్సాపురం 221 కిలోమీటర్ల మార్గం తదితర అభివృద్ధి పనుల్ని వేదిక వద్ద నుంచే ప్రధాని ప్రారంభిస్తారు. 7 వేల 614 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఈ పర్యటనలో మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాన వేదిక వద్ద దాదాపు 60 వేల మంది కూర్చునేలా, మిగిలిన వారు అనుబంధ మైదానంలో డిజిటల్ తెరలు ద్వారా కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర బలగాలన్నీ కలిపి దాదాపు పదివేల మంది పాలు పంచుకుంటున్నారు. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల నుంచి జనాన్ని పెద్ద ఎత్తున తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సభలో ప్రధాని దాదాపు 40 నిమిషాలు ప్రసంగిస్తారని సమాచారం.

అయితే ప్రధాని విశాఖ పర్యటన ఖరారు అయినప్పటి నుంచి రైల్వే జోన్‌పై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే విశాఖ చేరుకున్న తూర్పుకోస్తా రైల్వే జనరల్ మేనేజర్.. రైల్వే స్టేషన్, వాల్తేర్ జీఎం వైర్ లెస్ కాలనీ ఇతర స్థలాలను సందర్శించారు. ప్రధాని లేదా రైల్వే మంత్రి రైల్వే జోన్ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో విశాఖ వాసులతో పాటు రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details