Huge Arrangements at LB Stadium for New CM Oath Ceremony : తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి(New CM Oath) ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది తరలివచ్చే అవకాశముందని అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యులు, కీలక ప్రముఖులు తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటోంది.
ప్రమాణస్వీకార ఏర్పాట్లపై ఇప్పటికే సంబంధిత శాఖలకు నిర్దేశించిన సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా(DGP Ravi Gupta), ఉన్నతాధికారులు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మహేశ్ కుమార్ గౌడ్, అంజనీకుమార్, వసంతకుమార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా పార్టీలోని సీనియర్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత అయోధ్యరెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈమెకే తొలి ఉద్యోగం - రేవంత్ రెడ్డి అభయహస్తం
"ప్రధాన వేదికలు మూడు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి వీవీఐపీల కోసం ముఖ్యమంత్రులు, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేవాళ్లు, ఏఐసీసీ ముఖ్య నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు, వేదికకు కుడివైపున గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలు, వేదికకు ఎడమవైపు ఏఐసీసీ జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల మంత్రులు ఉంటారు. ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల కోసం నిర్ధిష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తారు. అంతకు ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు రేవంత్ రెడ్డి. వేదిక గ్రౌండ్లో 30 వేల నుంచి 35 వేల మంది ఉంటారు. ఇంకా ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంది అందుకే గ్రౌండ్ చుట్టూ ఎల్ఈడీ స్కీన్లను ఏర్పాటు చేస్తున్నాము."- అయోధ్యరెడ్డి, కాంగ్రెస్ నేత