తెలంగాణ

telangana

ETV Bharat / state

Heroin Seized in Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో రూ.41.30 కోట్ల హెరాయిన్ పట్టివేత

Heroin Seized in Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిత్యం కట్టుదిట్టంగా తనిఖీలు చేపడుతున్నా స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. తాజాగా ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి భారీగా హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.41.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Shamshabad Airport
Shamshabad Airport

By

Published : May 8, 2023, 10:52 PM IST

Heroin Seized in Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఏదో రకంగా వస్తువులు, బంగారం, మత్తు పదార్థాలను స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. తనిఖీలకు దొరకకుండా వారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. రకారకాల పద్ధతులలో అక్రమ రవాణా సాగిస్తున్నట్లు ఇటీవల పలు కేసుల్లో బయటపడింది. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు అధికారులు. తాజాగా హెరాయిన్​ అక్రమ రవాణా గుట్టును డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41.30 కోట్ల విలువైన హెరాయిన్​ను డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా పెట్టారు. ఆఫ్రికాలోని మాలావి నుంచి దోహా మీదుగా హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికురాలి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె లగేజీని తనిఖీ చేశారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్

ఈ క్రమంలోనే ఆమె సూట్​కేసును డీఆర్​ఐ అధికారులు తనిఖీ చేయగా.. అందులో తెల్లటి పౌడర్ బయటపడింది. దీనిని హెరాయిన్ గా గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 5.9 కిలోల బరువున్న హెరాయిన్​ను ఎవరికి అనుమానం రాకుండా సూట్​కేసులో తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. భారతీయురాలైన సదరు మహిళ.. మాలావి నుంచి దీనిని తీసుకొని హైదరాబాద్​లో ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.

నిఘా ఏజెన్సీలకు పట్టుబడకుండా జాగ్రత్తలు:ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న డీఆర్ఐ అధికారులు..నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ హెరాయిన్ ఎక్కడికి చేరవేయాలనుకున్నారనే దానిపై కూపీ లాగుతున్నారు. స్మగ్లర్లు మాత్రం నిఘా ఏజెన్సీలకు పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. హెరాయిన్ చేరవేస్తే కొంత డబ్బు ఇచ్చేలా మహిళతో ఒప్పందం కుదుర్చుకొని.. శంషాబాద్ విమానాశ్రయంలో నిర్దేశించిన ప్రాంతానికి తీసుకెళ్లాలని సూచించినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్​లో హెరాయిన్​ను తీసుకునే వాళ్ల వివరాలు సైతం నిందితురాలికి తెలియదని డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details