హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తోన్న ఓ కానిస్టేబుల్కు కొవిడ్-19 సోకింది. లాక్డౌన్ వేళ నిత్యం వాహనాల తనిఖీ, ఎన్ఫోర్స్మెంట్ విధులు నిర్వర్తిస్తున్నాడు. పది రోజుల కింద ఆరోగ్యం సహకరించట్లేదని స్టేషన్ అధికారులకు వివరించాడు. విధులకు హాజరు కాలేనని చెప్పగా.. అధికారులు అందుకు అంగీకరించారు.
కానిస్టేబుల్కు కరోనా... తోటి సిబ్బంది హైరానా - తెలంగాణలో కరోనా కేసులు
కొవిడ్ -19 నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పక్కాగా అమలు చేసేందుకు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులనూ కరోనా మహమ్మారి వదల్లేదు. హైదరాబాద్ చిక్కడపల్లి స్టేషన్కు చెందిన ఓ కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ వచ్చింది.
నాటి నుంచి ఇంట్లో ఉండి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. పది రోజులుగా బాధితుడు విధులు నిర్వహించడం లేదని.. స్టేషన్లోని ఇతర సిబ్బందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని పోలీసు అధికారులు వివరించారు.
కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త దవానలంలా వ్యాపించటం వల్ల పోలీస్ సిబ్బందిలో కలవరం నెలకొంది. అనునిత్యం అన్ని వర్గాల ప్రజలతో సంబంధాలు ఉండే సిబ్బందికి పాజిటివ్ రావడం వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.