tarakaratna update : నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో నాలుగోరోజు వైద్యసేవలు కొనసాగుతున్నాయి. తారకరత్నకు ఎన్ హెచ్చ్ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించి 48 గంటలు పూర్తి కావడంతో నిన్న రాత్రి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య ఇంకా విషమంగానే ఉందని.. వెంటిలేటర్ సాయంతో అత్యున్నత వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే..? - Hrudayalaya
tarakaratna update : నందమూరి తారకరత్నకు వెంటిలేటర్ సాయంతో అత్యున్నత వైద్యసేవలు అందిస్తున్నట్లు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు వెల్లడించారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని బులెటిన్‌లో తెలిపారు.

tarakaratna update
మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తారకరత్నకు ఇంతవరకు ఎక్మో చికిత్స చేయలేదని ప్రకటనలో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గుండె, కాలేయంతో పాటూ ఇతర అవయవాలన్నీ మామూలు స్థితికి వచ్చాయని నందమూరి రామకృష్ణ తెలిపారు. మెదడుకు సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి: