తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ ఆసుపత్రిలో చెత్తా చెదారంపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం - గాంధీ ఆసుపత్రి తాజా వార్తలు

గాంధీ ఆసుపత్రిలో చెత్తా చెదారంపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దినపత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ ఘటనపై జులై 28లోపు వివరణ ఇవ్వాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది.

గాంధీ ఆసుపత్రిలో చెత్తా చెదారంపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం
గాంధీ ఆసుపత్రిలో చెత్తా చెదారంపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం

By

Published : Jun 30, 2020, 10:15 PM IST

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చెత్తా చెదారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కుప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించకుండా గుట్టలుగా తయారుచేయడంపై అసహనం వ్యక్తం చేసింది.

ఈ విషయంలో దినపత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా హెచ్ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ ఘటనపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు జులై 28లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details