హైదరాబాద్ నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలపై వివిధ మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆ కథనాల ఆధారంగా కేసును సుమోటోగా స్వీకరించింది.
కాలుష్య కారక పరిశ్రమలపై హెచ్ఆర్సీ సీరియస్.. సుమోటోగా కేసు స్వీకరణ - హెచ్ఆర్సీ తాజా వార్తలు
రాజధాని నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. వివిధ మాధ్యమాల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించింది.
బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, అమీన్‌పూర్, నల్లగండ్ల, మదీనాగూడ తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమలు విడుదల చేసే ఉద్గారాల్లో విష వాయువుల గాఢత మరీ ఎక్కువగా ఉంటోందని కథనాల్లో పేర్కొన్నారు. స్పందించిన కమిషన్.. ఆరోగ్యంగా జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని స్పష్టం చేసింది. జనావాసాల మధ్య ఉన్న కాలుష్య కారక పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అక్టోబరు 22లోపు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పరిశ్రమల కమిషనర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ( హైదరాబాద్ ) సభ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
ఇదీచూడండి.. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
TAGGED:
హెచ్ఆర్సీ తాజా వార్తలు