హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు పంపిణీ చేస్తున్న భోజనంలో పురుగులు రావడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలను కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది.
ఇటీవల నిలోఫర్ ఆస్పత్రిలో రోగులకు, వైద్య సిబ్బందికి పెట్టే అన్నంలో కూరలో పురుగులు కనిపించడంతో ఓ రోగి సహాయకుడు ఆస్పత్రిలో ఆందోళన చేశాడు. ఈ విషయంపై రోగి సహాయకుడు, వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా సూపరింటెండెంట్ పట్టించుకోలేదని వారు ఆరోపించారు.