IGRS Telangana How it Works: ప్రజలకు సులువైన.. మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్(IGRS)ను ప్రారంభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని పౌరులకు ఒకే వేదిక ద్వారా అందించడం ఈ పోర్టల్ ఉద్దేశం. ఇందులో చాలా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలేంటి..? ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(EC) ఎలా చెక్ చేయాలి? వంటి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
IGRS తెలంగాణ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సేవల జాబితా ఇదే:..
List of Services is Available in Telangana State Integrated Grievance Redressal System(IGRS):-
- ఆస్తి నమోదు(Property Registration)
- మార్కెట్ విలువ శోధన(Market value Search)
- నిషేధించబడిన ఆస్తి(Prohibited Property)
- సర్టిఫైడ్ కాపీ(Certified Copy)
- ఎన్‌కంబరెన్స్ సెర్చ్(EC)
- eSTAMPS
- వివాహ నమోదు(Marriage Registration)
- సొసైటీ రిజిస్ట్రేషన్(Society Registration)
- సంస్థ నమోదు
- చిట్ ఫండ్ సమాచారం(Registred Chit Fund Information)
- స్టాంప్ వెండర్లు / నోటరీలు / ఫ్రాంకింగ్ సేవలు
- డాష్‌బోర్డ్‌లు(Dashboards)
ఈసీ అంటే ఏమిటి..?
What is EC :ఈసీ అంటే.. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (Encumbrance Certificate). ఇందులో.. ఫలానా భూమి ఇప్పటి వరకు ఎన్ని సార్లు చేతులు మారింది..? అమ్మిన వారు ఎవరు..? కొనుగోలు చేసింది ఎవరు..? అనే వివరాలు ఈసీలో ఉంటాయి. ఏదైనా భూమిని కొనుగోలు చేస్తున్నప్పుడు.. కొనేవారు తప్పకుండా ఆ భూమికి సంబంధించిన ఈసీని తీసుకోవాలి. తద్వారా.. ఆ భూమికి నిజమైన ఓనరు ఎవరు..? ఇప్పుడు యజమానిగా చెబుతున్న వ్యక్తేనా? కాదా? అనే విషయం తేలిపోతుంది. అందువల్ల.. భూముల కొనుగోలు విషయంలో ఈసీ అనేది అత్యంత కీలకంగా పనిచేస్తుంది.
IGRS తెలంగాణ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) సెర్చ్ చేయడం ఎలా:
How to Get EC From IGRS Website: IGRS తెలంగాణ పోర్టల్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (EC)ని ఎలా సెర్చ్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
- తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్‌మెంట్ అధికారక పోర్టల్‌ని ఓపెన్ చేయండి.(https://registration.telangana.gov.in)
- హోమ్ పేజీలో “ఆన్‌లైన్ సర్వీసెస్” సెక్షన్లో ఉన్న “ఎన్‌కంబరెన్స్ సెర్చ్ (Encumbrance Search)”పై క్లిక్ చేయండి.
- నెక్ట్స్ పేజీలో Instructions వస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి.. కావాల్సిన వివరాలను నమోదు చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత, ఎన్‌కంబరెన్స్ కోసం సెర్చ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ " Document Number" లేదా "Property" ద్వారా సెర్చ్ చేయవచ్చు.
- ఒకవేళ మీరు "Document Number" సెలెక్ట్ చేస్తే.. తప్పనిసరిగా మీ SRO పేరులోని మొదటి కొన్ని అక్షరాలు, అలాగే రిజిస్ట్రేషన్ సంబంధిత సంవత్సరాన్ని నమోదు చేసి, ఆపై Submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- లేదా మీరు "Property" ద్వారా చేయగలిగితే, తప్పనిసరిగా ఫ్లాట్ నంబర్, ఇంటి నంబర్, జిల్లా పేరు, SRO వివరాలను నమోదు చేసి, ఆపై " Submit" బటన్‌ను క్లిక్ చేయాలి.
- చివరగా, మీ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్(EC) స్క్రీన్‌పై కనిపిస్తుంది.
IRGS తెలంగాణ పోర్టల్‌లో SRO వివరాలను ఎలా తెలుసుకోవాలి:
How To Know SRO in IRGS Telangana Portal:
- తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్‌మెంట్ అధికారిక పోర్టల్‌ని ఓపెన్ చేయండి.(https://registration.telangana.gov.in)
- "Browse" విభాగానికి వెళ్లి, హోమ్ పేజీలో "Property Registration"ను క్లిక్ చేయండి.
- పేజీ ఓపెన్ అయిన తర్వాత.. "Know Your SRO/Village" ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- ఈ పేజీలో రెండు ఆప్షన్స్ వస్తాయి. అవి "Know Your Jurisdiction SRO" అండ్ "Village Directory"”
- మీరు ఏదైనా ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు, మీరు “"Know Your Jurisdiction SRO" ఎంచుకోగలిగితే,“Sub-Registrar Office పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు “జిల్లా,”“మండలం,”“గ్రామం” ఎంచుకుని, ఆపై Submir బటన్ నొక్కండి. మీ SRO వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- ఒకవేళ మీరు "Village Directory"ని సెలెక్ట్ చేస్తే.. జిల్లాల జాబితా నెక్ట్స్ పేజీలో ఓపెన్ అవుతుంది.
- మీరు మీ “జిల్లా”పై క్లిక్ చేస్తే, “మండల్” జాబితా ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు మీ "Mandal" ఎంచుకుని దానిపై క్లిక్ చేయాలి.
- తర్వాత Village List జాబితా ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ SRO వివరాలను కనుగొనవచ్చు.