How to make Curd pachadi : వేసవి కాలంలో చలువ చేసే పదార్థాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అలాగని పెరుగు, మజ్జిగలతోనే కాలక్షేపం చేయలేం కదా. వాటికి పోషక విలువలు ఉన్నా ఊరికే అవే తినాలంటే చిరాకు. అందుకే వాటిని కాస్త వెరైటీగా వండుకుంటే రుచితో పాటు ఆరోగ్యం బోనస్‌గా వస్తుంది. అలాంటి కొన్ని చలువ చేసే పదార్థాలు, వాటి తయారీ విధానం ఇప్పుడు చుద్దాం.
- బెండకాయ పెరుగు పచ్చడి
కావాల్సిన పదార్థాలు : బెండకాయలు పావు కిలో, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, ఆవాలు, పసుపు, ఇంగువా, నూనె, ఉప్పు, చిక్కని పెరుగు( ఇవన్నీ తగిన మోతాదులో తీసుకోవాలి)
తయారీ:ముందుగా బెండకాయలను తరిగి ముక్కలుగా చేసుకోవాలి. ఆ తరువాత నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వీటిని వేసి మరి పేస్టులా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక ప్యాన్‌లో చెంచా నూనె వేసి వేడెక్కాక ఆవాలు వేయాలి. అవి వేడిక్కిన తరువాత దీనిలో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ముద్ద, ఇంగువ, పసుపు వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేగనివ్వాలి. స్టౌ కట్టేసి కాస్త చల్లారనిచ్చి బెండకాయ ముక్కలు, కప్పు పెరుగు, తగినంత ఉప్పు వేసుకుంటే నోరురూరించే బెండకాయ పెరుగు పచ్చడి రెడీ.
- దొండకాయ పెరుగు పచ్చడి
కావాల్సినవి: గండ్రంగా తరిగిన దొండకాయల ముక్కలు, వాటికి తగినట్లుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, చిలికిన పెరుగు, నీళ్లు.