How to Lodge GHMC Complaints in Online : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి ఎంత వేగంగా విస్తరిస్తోందో.. స్థానికులను సమస్యలు కూడా పీడిస్తూనే ఉన్నాయి. దీంతో.. వీటిని పరిష్కరించేందుకు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సిద్ధమైంది. సమస్యలపై నేరుగా జీహెచ్ఎంసీకే (https://www.ghmc.gov.in/) కే ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రజలకు కల్పించింది. మరి, మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే.. ఇలా కంప్లైంట్ చేయండి.
డ్రైనేజీ ఫిర్యాదులు ఇలా..
Complaint on Drainage :కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మ్యాన్ హోల్లో మునిగి ఓ బాలుడు కూడా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో.. మీ ఏరియాలో ఏవైనా డ్రైనేజ్ సమస్యలు ఉంటే.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. సత్వరమే స్పందించేందుకు గానూ.. అధికారులు వాట్సాప్ నంబర్ ఇచ్చారు. 9848021665 నంబర్ కు ఫొటోల ద్వారా మీ ఏరియా పరిస్థితిని తెలుపుతూ ఫిర్యాదు చేయండి.
కుక్కలకు సంబంధించిన ఫిర్యాదులు..
Complaint on Street Dogs :వీధికుక్కలు మనుషులను కరవడమే కాదు.. ఏకంగా ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ముఖ్యంగా పిల్లలు రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. నగరంలో కొన్ని చోట్ల కుక్కల బెడద తీవ్రంగా ఉంది. మీ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. వెంటనే GHMCకి ఫిర్యాదు చేయండి. ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్ 040-2111-1111 కాల్ చేయండి. లేదంటా My GHMC యాప్ డౌన్లోడ్ చేసుకొని.. అందులోనుంచి కూడా కంప్లైట్ చేయండి.
ఉస్మాన్‌నగర్‌లో దారుణ పరిస్థితులు.. ఏ వీధి చూసినా నీరే!
చెట్ల నరికివేతపై ఫిర్యాదులు..
Complaint on cutting of trees :మహానగరం రోజు రోజుకూ కాంక్రీట్ జంగల్‌గా మారిపోతోంది. కొన్ని ప్రాంతాల్లోనైతే.. చూడ్డానికి కూడా చెట్టు కనిపించట్లేదు. దీనివల్ల కాలుష్యం తీవ్రత ఎంతగా పెరిగిపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో చెట్లు నాటడం సంగతి పక్కనపెడితే.. ఉన్న చెట్లను నరికేస్తుంటారు కొందరు. అనుమతుల్లేకుండా చెట్లను నరకడం చట్టవిరుద్ధం. ఈ సమస్యపై మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే.. టోల్-ఫ్రీ నంబర్ 1800 425 5364కు కాల్ చేయండి. అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చెత్తపై ఆన్‌లైన్ కంప్లైంట్స్..