How to Get TSRTC Parking Lot Tender :మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంచి సువర్ణావకాశం కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్న టీఎస్ఆర్టీసీ తాజాగా మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. టీఎస్ఆర్టీసీ(TSRTC) బస్టాండ్ ఆవరణలో పలు వ్యాపారాలు నిర్వహించేందుకు అవకాశం ఇస్తోంది. ఈ మేరకు 4 అంశాలకు సంబంధించి టెండర్లు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. దీనికోసం ఆసక్తి గల వారి నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- టీఎస్ఆర్టీసీ ప్రకటించిన ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే.. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, వరంగల్ రీజియన్లలో ఉన్న వివిధ బస్స్టేషన్లతో పాటు హైదరాబాద్‌లోని తార్నాక హాస్పిటల్లో ఖాళీగా ఉన్న షాపులు, స్థలాలు, క్యాంటీన్ స్టాల్స్, పార్కింగ్ స్థలాల నిర్వహణ కొరకు తెలంగాణ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానిస్తోంది.
- ఇకపోతే రెండో అంశమేమిటంటే.. తెలంగాణలోని 33 స్థలాల్లో పెట్రోల్ బంకులు నెలకొల్పుటకు కూడా అవకాశం ఇస్తోంది. వీటిని నిర్వహించేందుకు సర్వీస్ ప్రొవైడర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
- అదేవిధంగా మహబూబ్‌నగర్, నల్గొండ రీజియన్లలో బస్ డిపోలు, బస్ స్టేషన్లలో లాజిస్టిక్స్ సర్వీసెస్ నిర్వహణ కోసం కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టెండర్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి.
- ఇక చివరగా.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ రీజియన్లలోని బస్ డిపోలు, బస్ స్టేషన్లతో పాటు జోనల్ వర్క్‌షాప్, ఉప్పల్‌లో ఔట్‌సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహించేందుకు టీఎస్ఆర్టీసీ అప్లికేషన్స్ స్వీకరిస్తోంది. ఆసక్తిగల వారు టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్లో టెండర్లకు సంబంధించి ఓ ప్రకటనను పోస్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇప్పుడే అప్లై చేసుకోండిలా..