తెలంగాణ

telangana

ETV Bharat / state

How to Download Vehicle RC Online Telangana: ఆన్​లైన్​లో RCని ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో తెలుసా..? - Road transport Office

How to Download Vehicle RC Online Telangana: టెక్నాలజీ సాయంతో అన్ని పనులు ఈజీ అయిపోతున్నాయి. ఇంటి నుంచే చాలా పనులు జరిగిపోతున్నాయి. ఇప్పుడు.. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) కూడా ఆన్‌లైన్‌లో సులువుగా డౌన్లోడ్​ చేసుకోవచ్చు. మరి.. అది ఎలాగో తెలుసుకుందాం.

Download Vehicle RC Online Telangana
How to Download Vehicle RC Online Telangana

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 2:59 PM IST

How to Download Vehicle RC Telangana Online: వాహనం కొంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఆర్‌టీఓ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) లభిస్తుంది. ఏ వాహనానికైనా ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రతీ వాహనాన్ని నమోదు చేసుకొని.. దానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్‌ కేటాయిస్తుంది రవాణా శాఖ. మీ దగ్గర ఉన్న వాహనం మీదే అని చెప్పడానికి ప్రధాన ఆధారం ఇదే.

ఈ సర్టిఫికెట్.. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 15 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత దాని గడువు ముగిసిపోయినట్టే. అయితే.. మీరు ఆ RCని మరో ఐదేళ్లపాటు పునరుద్ధరించుకోవచ్చు. లేదంటే.. ఒక నెల వరకు చెల్లుబాటు అయ్యేలా తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను కూడా పొందవచ్చు. ఈ స్టోరీలో.. RTO ఆఫీసుకు వెళ్లకుండానే ఆన్​లైన్​లోనే రిజిస్ట్రేషన్​ కాపీని డౌన్​లోడ్​ చేసుకోవడం ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలో వెహికల్​ RCని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయడం ఎలా?
How to download vehicle RC Telangana online?:తెలంగాణ ప్రభుత్వం ఆన్​లైన్​ RCని డౌన్​లోడ్​ చేసుకోడానికి.. వాహనదారులకు RTA m-wallet యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా వాహన యజమానులు వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇతర పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు ఈ యాప్‌ని ఉపయోగించవచ్చు. హార్డ్ కాపీ బదులుగా.. వాహన యజమానులు ఈ డిజిటల్ కార్డ్‌ని చూపొచ్చు.

  • ముందుగా మీ ఫోన్​లో ప్లేస్టోర్‌ని తెరిచి, RTA m-wallet యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఆపై మొబైల్ నంబర్, పేరు, మెయిల్ ఐడిని ఎంటర్​ చేసి యాప్‌లో నమోదు చేసుకోండి.
  • మొబైల్ నంబర్‌ని ఉపయోగించి మీ ఖాతాకు సైన్-ఇన్ చేసిన తర్వాత, మీకు OTP వస్తుంది.
  • సైన్ ఇన్ చేసిన తర్వాత, మీ స్కాన్​ చేసిన పత్రాలను అప్​లోడ్​ చేయాలి.
  • స్క్రీన్​పై రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కనిపిస్తుంది.
  • డౌన్‌లోడ్ చేయడానికి డౌన్‌లోడ్ ఎంపికపై క్లిక్ చేయండి.
  • డౌన్​లోడ్​ అయిన తర్వాత దానిని సేవ్​ చేసి పెట్టుకోండి.

వాహనం RC కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
How to apply for a vehicle RC?

  • మీరు కొత్తగా కొనుగోలు చేసిన వాహనంతో.. మీ సమీపంలోని RTO కార్యాలయాన్ని వెళ్లండి.
  • అక్కడ వాహనం ధ్రువీకరణ, తనిఖీ ప్రక్రియ కొనసాగుతుంది.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడానికి మీ వివరాలను ఫారమ్ 20లో నింపండి.
  • ఆ తరువాత, RTO అధికారం ఛాసిస్ నంబర్ ముద్రణను తీసుకుంటుంది.
  • వారు మీ పత్రాలను అడుగుతారు.. వాటిని సమర్పించండి.
  • ఇప్పుడు తదనుగుణంగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రసీదు తీసుకోండి.

అవసరమైన పత్రాలు:
Required Documents:

  • RC పొందడానికి అవసరమైన పత్రాలు:
  • ID ప్రూఫ్
  • AGE ఫ్రూప్​
  • వాహన బీమా కాపీ
  • వాహనం ఇన్వాయిస్ కొనుగోలు
  • పాన్ కార్డ్
  • తాత్కాలిక రిజిస్ట్రేషన్ కాపీ
  • రిజిస్ట్రేషన్ ఫీజు
  • Form 20
  • form 22
  • Form 21
  • Form 34
  • చిరునామా ధ్రువీకరణ పత్రం

వాహన RC రుసుము:

Vehicle RC fee: వాహన RC నమోదుకు రుసుము.. వాహన రకాన్ని బట్టి విభిన్నంగా ఉంటుంది.

Vehicle Type Amount
Invalid Carriage Rs.20
Motorcycle Rs.60
Light Motor Vehicle Rs.200 for non-transport vehicle and Rs.300 for commercial Vehicle
MGV/MPV Rs.400
HPV/HGV Rs.600
Imported Motor Vehicle Rs.800
Imported Motorcycle Rs.300
Not Mentioned Vehicle Rs.300

ABOUT THE AUTHOR

...view details