తెలంగాణ

telangana

ETV Bharat / state

How to Apply Telangana OBC Certificate in Online: ఆన్​లైన్​లో OBC సర్టిఫికెట్​.. ఇలా అప్లై చేయండి! - Other Backward Classes

How to Apply Telangana OBC Certificate in Online : ఓబీసీ కమ్యూనిటీలకు చెందిన వారికి.. OBC ధ్రువీకరణ పత్రం చాలా ముఖ్యమైనది. మరి.. ఈ సర్టిఫికెట్​ను ఎలా పొందాలి..? దానికోసం ఎలా దరఖాస్తు చేయాలి..? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Telangana OBC Certificate in Online
How to Apply Telangana OBC Certificate in Online

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 4:06 PM IST

How to Apply OBC Certificate Telangana in Online:కేంద్ర, రాష్ట్రాలు ప్రభుత్వాలు అందిస్తున్న పలు ప్రయోజనాలను పొందాలంటే.. కుల ధ్రువీకరణ పత్రం(Caste Certificate) తప్పనిసరి. అయితే.. ఇందులో OBC అనేది కూడా ఉంది. OBC అంటే Other Backward Classes. మరి, దీనికోసం ఆన్​లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి..? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

Telangana Single Women Pension Scheme : ఒంటరి మహిళలకు పింఛన్.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసా..?

OBC సర్టిఫికెట్ దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు..

Documents Required for OBC Certificate in Telangana

  • దరఖాస్తు ఫారం
  • ఆధార్ కార్డ్
  • రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు
  • దరఖాస్తుదారు తండ్రి/తల్లి ఆస్తి వివరాలు (Optional)
  • దరఖాస్తుదారు తండ్రి/తల్లి ఉద్యోగ వివరాలు/ఆదాయ పన్ను రిటర్న్‌లు(For Professionals)
  • కుల ధ్రువీకరణ పత్రం

How to Get Loan On Insurance Policy : మీకు డబ్బు అత్యవసరమా.. ఇన్సూరెన్స్​ పాలసీ ఉందా..??

OBC సర్టిఫికెట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి..? :

How to Apply OBC Certificate in Telangana by Online :

  • ముందుగా మీ-సేవ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ (https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htm)లోకి వెళ్లండి.
  • హోమ్​ పేజీ కుడివైపున.. Login కాలమ్​లో New User ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • తర్వాత స్క్రీన్​మీద Create Profile ID అని కనిపిస్తుంది.
  • అక్కడ అన్ని వివరాలు ఎంటర్​ చేసిన తర్వాత Submit ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • మీ ఫోన్​ నెంబర్​కు OTP వస్తుంది. దానిని ఎంటర్​ చేసి వెరిఫై చేసిన తర్వాత మీరు విజయవంతంగా రిజిస్టర్​ అయినట్లు స్క్రీన్​ మీద కనిపిస్తుంది.
  • తర్వాత హోమ్​ పేజీలోకి వెళ్లాలి.
  • అనంతరం లాగిన్​ కాలమ్​లోకి వెళ్లి.. మీ ఫోన్​ నెంబర్​, క్రియేట్​ చేసిన పాస్​వర్డ్​ ఎంటర్​ చేసి Login ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • మీకు స్క్రీన్​ మీద పలు సర్వీసులు కనిపిస్తాయి. అందులో సర్టిఫికెట్​ ఆప్షన్స్​పై క్లిక్​ చేసి.. Revenue ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అందులో OBC Certificate ఆప్షన్​పై క్లిక్​ చేస్తే.. అప్లికేషన్​ ఫారమ్​ ఓపెన్​ అవుతుంది.
  • అందులో అన్ని వివరాలను ఎంటర్​ చేసి.. కావాల్సిన డాక్యుమెంట్లను అప్​లోడ్​ చేయాలి. అనంతరం Review and Submit బటన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత Make Payment ఆప్షన్​పై క్లిక్​ చేసి ఫీజు పే చేయాలి.
  • అప్లికేషన్​ను సబ్మిట్​ చేసిన తర్వాత Acknowledgement or Application Reference Number స్క్రీన్​ మీద కనిపిస్తుంది.
  • దానిని డౌన్​లోడ్​ చేసుకుని ప్రింట్​అవుట్​ తీసుకోండి
  • మీ దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత, మీరు ఆన్‌లైన్‌లో OBC సర్టిఫికెట్ అందుకుంటారు.

How to Check TS LRS Application Status 2023: తెలంగాణ LRS అప్లికేషన్​ స్టేటస్​.. ఇలా తెలుసుకోండి!

ఆఫ్​లైన్​ మోడ్‌లో OBC సర్టిఫికెట్‌కు ఎలా దరఖాస్తు చేయాలి..?

How to Apply OBC Certificate in Telangana by Offline :

  • పైన తెలిపిన డాక్యుమెంట్లు తీసుకొని మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్లండి
  • అక్కడ అప్లికేషన్​ ఫారమ్​ తీసుకుని అందులో అన్ని వివరాలను పూర్తి చేయండి
  • అప్లికేషన్​ ఫారమ్​తో పాటు డాక్యుమెంట్ల జిరాక్స్​లు జత చేసి.. మీ సేవ ఆపరేటర్​కు ఇవ్వాలి. అనంతరం ఫీజు చెల్లించండి
  • ఆ తర్వాత మీ సేవ ఆపరేటర్​.. Acknowledgement or Application Reference Number రసీదును అందిస్తారు.

How to Apply For Duplicate Voter ID Card in Online : ఓటర్ కార్డు పోయిందా..? డోన్ట్​వర్రీ.. ఇలా పొందండి!

ABOUT THE AUTHOR

...view details