How To Apply Marriage Certificate In Telangana:ప్రతి ఒక్కరూ పెళ్లి వీడియోలు, ఫొటొలను భద్రంగా దాచుకుంటారు.. ఇదేవిధంగా.. మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా జాగ్రత్తగా దాచుకోవాల్సిన కాలమిది. భవిష్యత్తులో ఎన్నో అవసరాలకు వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం. కానీ.. చాలా మంది వివాహ ధ్రువపత్రాన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదు. మీరు మాత్రం అలా చేయకండి. వెంటనే సర్టిఫికెట్ తీసుకోండి. దీనికోసం ఏం చేయాలో.. ఇక్కడ తెలుసుకుందాం.
వివాహ ధ్రువీకరణ పత్రం కోసం అవసరమైన పత్రాలు.. (Documents Required for Marriage Certificate in Telangana:)
- దరఖాస్తు ఫారం (మీసేవా కేంద్రాల నుంచి తీసుకోవచ్చు. డౌన్ లోడ్ చేసుకోవచ్చు.)
- పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
- వధువు, వరుడు అడ్రస్ ప్రూఫ్
- డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్
- ఆధార్ కార్డ్
- వెడ్డింగ్ కార్డ్ ఒరిజినల్
- 1 లేదా 2 పెళ్లి ఫొటోలు
- ముగ్గురు సాక్షుల ఫొటోలు, సంతకాలు
- స్వీయ ధ్రువీకరణ పత్రాలు(Self Attested Documents)
- కుల ధ్రువీకరణ పత్రాలు
వివాహ ధ్రువీకరణ పత్రం పొందడానికి అర్హత ప్రమాణాలు (Eligibility Criteria to get the Marriage Certificate) :
- పురుషులకు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- ఎలాంటి పెనాల్టీ లేకుండా 90 రోజులలోపు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- పెనాల్టీతో 90-150 రోజుల మధ్య అప్లై చేసుకోవచ్చు.
- హిందూ వివాహ చట్ట ప్రకారం దరఖాస్తు చేసుకుంటే రూ.100
- ప్రత్యేక వివాహ చట్ట ప్రకారం దరఖాస్తు చేసుకుంటే రూ.150
Telangana Single Women Pension Scheme : ఒంటరి మహిళలకు పింఛన్.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసా..?
వివాహ ధ్రువీకరణ పత్రం కోసం ఎలా దరఖాస్తు చేయాలి (How to Apply Marriage Certificate in Telangana) :
ఆన్‌లైన్ దరఖాస్తు..
- తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్‌మెంట్ అధికారక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి (https://registration.telangana.gov.in)
- Browse సెక్షన్లో MARRIAGE REGISTRATION ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత మీరు ఏ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నారో ఆ ఆప్షన్‌పై ఎంచుకోండి.(HINDU MARRIAGE REGISTRATION/ CHRISTIAN & MUSLIM MARRIAGE REGISTRATION/SPECIAL MARRIAGE ACT)
- అనంతరం HINDU MARRIAGE REGISTRATION పై క్లిక్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది.
- ఆ పేజీని కిందకు స్క్రోల్ చేస్తే..Go For Marriage Registration వస్తుంది. దానిని క్లిక్ చేయాలి.
- User Login పేజీలో User Typeని సెలెక్ట్ చేసి Citizen ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత New Users? Register ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ వివరాలను ఎంటర్ చేసి Register ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీ ఫోన్/ మెయిల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి.. వెరిఫై చేసుకోవాలి.
- ఆ తర్వాత మీకు స్క్రీన్‌పై CITIZEN SERVICE DASHBOARD పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ తర్వాత అక్కడ అన్ని వివరాలను ఎంటర్ చేసి.. కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఫీజును చెల్లించాలి.
- దరఖాస్తు సమర్పించిన తర్వాత, అధికారులు పత్రాలను ధ్రువీకరించి, అన్నీ సక్రమంగా ఉంటే, వారు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.