తెలంగాణ

telangana

ETV Bharat / state

How to Apply for Telangana Chenetha Mitra Scheme: "చేనేత మిత్ర" పథకానికి​.. ఇలా అప్లై చేసుకోండి! - చేనేత మిత్ర పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి

How to Apply for Telangana Chenetha Mitra Scheme: రాష్ట్రంలోని నేత‌న్న‌లకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం "చేనేత మిత్ర" అనే ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టింది. మరి దీనికి అర్హులు ఎవరు..? ఎలా అప్లై చేసుకోవాలి..? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Telangana Chenetha Mitra Scheme details
How to Apply for Telangana Chenetha Mitra Scheme

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 5:01 PM IST

How to Apply Telangana Chenetha Mitra Scheme:రాష్ట్రంలోని చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం.. "చేనేత మిత్ర" పథకాన్ని ప్రవేశపెట్టింది. చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందజేసి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ఈ పథకం లక్ష్యం. చేనేత మిత్ర పథకం కింద.. అందరికీ ఒకే విధమైన ఆర్థిక సహాయం అందుతుంది. మరి, ఈ స్కీమ్​కు అర్హత ప్రమాణాలేంటి? ఎలా దరఖాస్తు చేయాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

తెలంగాణ "చేనేత మిత్ర" పథకం ప్రయోజనాలు..

  • తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకం ప్రారంభించబడింది.
  • ఈ కార్యక్రమం ద్వారా చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
  • లబ్ధిదారులు డీబీటీ ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లోకి అందుకుంటారు.
  • ఈ పథకం కింద అందే ఆర్థిక సహాయం మొత్తం రూ.3,000
  • ఈ పథకానికి ఆన్‌లైన్లో లేదా.. ఆఫ్‌లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

National Handloom Day 2023 : నేతన్నలపై వరాల జల్లు.. ఆరోగ్యకార్డుతో పాటు ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేలు

తెలంగాణ చేనేత మిత్ర పథకానికి అర్హత ప్రమాణాలు:చేనేత మిత్ర పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారంతా.. తప్పనిసరిగా ఈ కింది అర్హతా ప్రమాణాలు కలిగి ఉండాలి.

  • తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా నివసించాలి.
  • దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా.. ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి.

దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు

  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో
  • ఆధార్ కార్డ్
  • పాన్ కార్డ్
  • ఓటరు కార్డు
  • మొబైల్ నంబర్
  • శాశ్వత సర్టిఫికేట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • బ్యాంక్ ఖాతా వివరాలు
  • పాస్‌బుక్ ఫొటోకాపీ
  • ఇ-మెయిల్ ఐడీ

తెలంగాణ చేనేత మిత్ర పథకం 2023 కోసం దరఖాస్తు చేయడం ఎలా..?

How to Apply Chenetha Mitra :

  • ముందుగా టీఎస్​ చేనేత అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.(https://handtex.telangana.gov.in/Default.aspx)
  • ఆ తర్వాత External Linksలో Chenetha Mitra ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • లాగిన్​ కాలమ్​లో Sign Up ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • అక్కడ పేరు, ఫోన్​ నెంబర్​, మెయిల్​ ఐడీ వివరాలు ఎంటర్​ చేసి Submit ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • తర్వాత హోమ్​ పేజీలోకి వెళ్లి వివరాలు ఎంటర్​ చేసి Login ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • మీకు స్క్రీన్‌పై దరఖాస్తు ఫారమ్ ఓపెన్​ అవుతుంది.
  • అక్కడ అవసరమైన అన్ని వివరాలనూ ఎంటర్​ చేయండి.
  • ఆ తర్వాత సమర్పించాల్సిన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయండి.
  • తర్వాత మీ బ్యాంక్ వివరాలను నమోదు చేయండి.
  • చివరగా, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి Submit బటన్‌పై క్లిక్ చేయండి.

Sircilla Handloom worker Weaved Images of G20 Leaders on Cloth : వస్త్రంపై జీ20 దేశాధినేతల చిత్రాలు.. సిరిసిల్ల చేనేత కార్మికుడి అరుదైన కళాఖండం

Handloom Entrepreneur : కష్టపడితే కానిదేముందని నిరూపిస్తున్న మహిళ

ABOUT THE AUTHOR

...view details