How to Apply Caste Certificate in Telangana: మన దేశంలో కేంద్ర, రాష్ట్రాలు ప్రభుత్వాలు అందిస్తున్న పలు ప్రయోజనాలను పొందాలంటే.. కుల ధ్రువీకరణ పత్రం(Caste Certificate) తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. రైతులకు సబ్సిడీ.. విద్యార్థులకు స్కాలర్ షిప్స్.. ఉద్యోగాల్లో రిజర్వేషన్స్.. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి.. ఇలా.. ఎన్నో విషయాల్లో కుల ధ్రువీకరణ పత్రం కంపల్సరీ. మరి, వీటికోసం ఆన్ లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి..? అప్లై చేసిన వాళ్లు.. అప్లికేషన్ స్టేటస్‌ను ఎలా ట్రాక్ చేయాలి..? అలాగే "మీ సేవ" ద్వారా సవరణ విధానాలు ఎలా చేయాలి..? వంటి విషయాలు తెలుసుకుందాం.
How to Apply Caste Certificate in Telangana Through Online :
- ముందుగా మీ సేవా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- రెవెన్యూ(Revenue) ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఆ తర్వాత కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓ విండో ఓపెన్ అవుతుంది.
- కుడివైపు కాలమ్‌లో డౌన్లోడ్ అప్లికేషన్ ఫారమ్ మీద క్లిక్ చేస్తే ఫారమ్ డౌన్లోడ్ అవుతుంది.
- అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ తీసిన తర్వాత.. అందులో పూర్తి వివరాలను నింపాలి.
- అంటే.. దరఖాస్తుదారు పేరు, కుటుంబ వివరాలు, ఇంటి చిరునామా, మతం, కులం మొదలైన సమాచారం ఇవ్వాలి.
- ఆ తర్వాత దరఖాస్తు ఫారానికి.. SSC మెమో, రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వంటి అడిగిన ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి.
- అన్ని పనులూ పూర్తిచేసిన తర్వాత.. ఈ సర్టిఫికెట్లన్నీ తీసుకొని, మీ సేవ కేంద్రానికి వెళ్లి సమర్పించాలి.
- ఈ సమయంలో.. మీ సేవ ఆపరేటర్ రసీదు సంఖ్య లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. దాన్ని భద్రపరుచుకోవాలి.
- సుమారు 15రోజుల తర్వాత మీ సేవా కేంద్రానికి వెళ్లి క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
- ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడం భారం అనుకుంటే.. కావాల్సిన పత్రాలన్నీ తీసుకొని మీసేవా కేంద్రానికి వెళ్లినా సరిపోతుంది. మిగిలిన ప్రాసెస్ మొత్తం వారే చేస్తారు.
Bihar Caste Census Supreme Court : 'కులగణన అధికారం కేంద్రానిదే! రాష్ట్రాలకు సంబంధం లేదు'