తెలంగాణ

telangana

ETV Bharat / state

How to Apply for Birth Certificate Telangana : జనన ధ్రువీకరణ పత్రం పొందడం ఎలా.. ? - birth certificate telangana

How to Apply for Birth Certificate Telangana : జనన ధ్రువీకరణ పత్రం శిశువు జన్మించినప్పుడు ఇచ్చే తొలి పత్రం. ఈ సర్టిఫికెట్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మరీ ఇప్పుడు ఈ పత్రం ఎలా పొందాలి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

Telangana Birth Certificate
date of birth certificate status

By

Published : Aug 16, 2023, 9:14 PM IST

Updated : Aug 17, 2023, 10:13 AM IST

How to Apply for Birth Certificate Telangana : శిశువు పుట్టినప్పుడు ప్రభుత్వం జారీ చేసే మొదటి పత్రం జనన ధ్రువీకరణ పత్రం. ఈ పత్రం ఒక వ్యక్తి యొక్క జననానికి సంబంధించిన ప్రాథమిక రికార్డుగా పనిచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వివిధ సేవల ప్రయోజనాలను పొందడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పాఠశాలలో ప్రవేశం, బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, బాలికా సమృద్ధి యోజన వంటి పథకాల ప్రయోజనాలను పొందేందుకు జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate) తప్పనిసరి. ఆధార్​కార్డ్ వంటి పత్రాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు కూడా ఇది ఎంతో అవసరం. దీనిని ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై బర్త్​ సర్టిఫికెట్​తో పాటు ఆధార్​

Birth Certificate in Telangana :జనన మరణాల చట్టం 1969 ప్రకారం, పుట్టిన 21 రోజుల్లోపు ప్రతి శిశువు జననాన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేయడం తప్పనిసరి. తెలంగాణలో జననాన్ని నమోదు చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్, (GHMC Commissioner) తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్లు సంబంధిత అధికారులుగా ఉంటారు.

ఈ వివరాలు నమోదు చేయడానికి బాధ్యులుగా ఎవరెవరూ ఉంటారు..

  • ఆసుపత్రిలో ప్రసవం జరిగితే.. మెడికల్ ఇంఛార్జ్ శిశువు జననాన్ని నమోదు చేయాలి.
  • ప్రసూతి గృహం మరియు నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జననం జరిగితే.. వైద్య అధికారి జననాన్ని నమోదు చేయడానికి అర్హులుగా ఉంటారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జననాన్ని నమోదు చేయడానికి.. ఇంఛార్జ్ పోలీసులు, గ్రామ పెద్దలు అర్హులుగా ఉంటారు.
  • ఇంట్లో ప్రసవం జరిగితే.. ఇంటి పెద్దలు శిశువు జననాన్ని నమోదు చేయాలి.
  • ఒకవేళ మహిళ ఏదైనా కారణం చేత జైలులో ఉన్నప్పుడు ప్రసవం జరిగితే.. అప్పుడు జైలుకు ఇంఛార్జ్​గా ఉన్న అధికారి శిశువు జననాన్ని నమోదు చేసుకోవాలి.

అవసరమైన పత్రాలు..

  1. తల్లిదండ్రుల గుర్తింపు రుజువు
  2. తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రం లేదా పదోతరగతి మార్కుల మెమో
  3. తల్లిదండ్రుల వివాహ ధ్రువీకరణ పత్రం
  4. ఆసుపత్రి లేదా వైద్య సంస్థచే జారీ చేయబడిన పిల్లల జనన రుజువు

జీహెచ్ఎంసీలో జనన ధ్రువీకరణ పత్రం దరఖాస్తు విధానంకు సంబంధించిన రుసుము వివరాలు..

  • ప్రతి లావాదేవీకి రూ.25
  • సర్టిఫికెట్ కాపీకి రూ.20
  • అదనపు కాపీకి రూ.5

తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్‌లో జనన ధ్రువీకరణ పత్రం దరఖాస్తు రుసుము వివరాలు..

  1. ఒక్కో లావాదేవీకి రూ.35 అదనంగా పోస్టల్ ఛార్జీలు
  2. అదనపు కాపీకి రూ.10
  3. ఆలస్యమైన జనన నమోదు లావాదేవీకి రూ.35
  4. ప్రతి అదనపు సంవత్సరానికి రూ.5 చొప్పున పెనాల్టీ

మరోవైపు జనన ధ్రువీకరణ పత్రం సవరణల రుసుము వివరాలు..

  • ఒక్కో లావాదేవీకి లావాదేవీకి రూ.35
  • సర్టిఫికెట్ కాపీకి రూ.20
  • అదనపు కాపీకి రూ.5
  • పోస్టల్ ఛార్జీలు రూ.60

'జనన, మరణ సర్టిఫికెట్ల జారీ ఇక వెంటనే'

దరఖాస్తు లేకుండానే జనన ధ్రువపత్రం

Last Updated : Aug 17, 2023, 10:13 AM IST

ABOUT THE AUTHOR

...view details