ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పటికే బస్సుల్లో టికెట్ విధానంను పునరుద్ధరించారు. రోజు వారి ప్రాతిపదికన తీసుకుంటున్న డ్రైవర్లు, కండక్టర్లకు విధి నిర్వహణకు సంబంధించిన విషయాలపై సూచనలు ఇస్తూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం 6గంటల వరకు 54.35శాతం మేర బస్సులు నడిపినట్లు తెలిపారు. ఆర్టీసీకి చెందిన బస్సులు 3557, అద్దె బస్సులు 1818 మొత్తం 5375 బస్సుల్ని తిప్పగలిగారు. ఎక్కువ మొత్తంలో ప్రైవేట్ వాహనాలను సమకూర్చుకుంటూ ప్రయాణీకులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను క్రమంగా పెంచుతోంది.
నిన్న ఎన్ని బస్సులు నడిపారంటే? - minister puvvada
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం 6గంటల వరకు 54.35శాతం మేర బస్సులు నడిపినట్లు తెలిపారు.
సాయంత్రం 6 గంటల వరకు ఎన్ని బస్సులు నడిపారంటే?