తెలంగాణ

telangana

ఇళ్ల ధరల్లో దేశంలోనే రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 11:42 AM IST

House Prices in Hyderabad 2023 : ఇళ్ల ధరల విషయంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చినప్పుడు, రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్​ నిలిచింది. ఈ మేరకు ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

House Price Hike in Hyderabad
House Price Hike in Hyderabad

House Prices in Hyderabad 2023 :ఓవైపు దేశంలో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. మరోవైపు ప్రజల కొనుగోళ్ల శక్తి కూడా మునుపటితో పోలిస్తే పెరిగింది. ముఖ్యంగా సొంత ఇంటికి ఆదరణ పెరగడం, తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తుండడం వంటి తదితర పరిణామాలతో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఇండ్ల ధరలు సైతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో ఇండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి.

దేశ వ్యాప్తంగా ఇళ్ల ధరలకు (House Price India) సంబంధించి రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. మొదటి స్థానంలో ముంబయి నిలిచింది. స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా విడుదల చేసిన అఫర్డబుల్‌ ఇండెక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆదాయంలో ఇంటి రుణం నెలవారీ కిస్తీ (ఈఎంఐ)కి చెల్లించే నిష్పత్తి ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు. హైదరాబాద్‌లో 2023లో ఇళ్ల ధరలు 11% పెరిగినట్లు ఈ నివేదిక తెలియజేసింది.

house prices have gone up in Hyderabad: 'హైదరాబాద్​లోనే ఇళ్ల ధరలు పెరిగాయి'

వివిధ నగరాల్లో ఇలా :ఇక అందుబాటు ధర ఇళ్ల విషయానికొస్తే, ముంబయి కొనుగోలుదార్ల ఆదాయంలో 51% వరకు ఈఎంఐకి చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో మాత్రం ఇది 30 శాతంగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో 27%, బెంగళూరులో 26%, చెన్నైలో 25%, పుణెలో 24%, కోల్‌కతాలో 24%, అహ్మదాబాద్‌లో 21% మేర చెల్లింపు జరపాల్సి వస్తోంది. 2024-25లో వృద్ధి రేటు పెరగడంతో పాటు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్‌ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, ఎండీ శిశిర్ బైజిల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇళ్ల కొనుగోలు శక్తీ పెరుగుతుందని ఆయన వివరించారు.

Hyderabad Second Most Expensive City in India :మరోవైపు రాష్ట్ర రాజధాని పరిధిలోని హైదరాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో నవంబరు నెలలో నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లలో స్వల్ప వృద్ధి నమోదైందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India)) విడుదల చేసిన నివేదికలో తెలిపింది. వార్షిక వృద్ధి 2శాతం ఉండగా, నెలవారీగా పెరుగుదల 8 శాతం నమోదైనట్లు వివరించింది. ఎన్నికల ప్రభావం భూములు, స్థలాల విక్రయాలపైనే తప్ప నివాసాలపై కాదని వీరి నివేదిక స్పష్టం చేస్తోంది.

'ఇళ్ల ధరల పెరుగుదలలో దేశంలోనే హైదరాబాద్ టాప్​'

'అద్దెలు పెరిగింది హైదరాబాద్​లో మాత్రమే!'

హౌసింగ్ రేట్లు పెరుగుదలలో 47వ స్థానంలో భారత్​

ABOUT THE AUTHOR

...view details