హైదరాబాద్ కాచిగూడ చప్పల్‌బజార్‌లోని ఓ ఇంట్లో కమలమ్మ అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమె కుమారుడు నాగోల్‌లో ఉండటంతో ఇంట్లో ఆమె ఒక్కరే ఉంటున్నారు. కమలమ్మ బాగోగులు చూసుకోవడానికి ఉప్పల్‌లోని ఓ ఏజెన్సీని సంప్రదించి, ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మిని మూడు రోజుల క్రితం పనిలో పెట్టుకున్నారు.
నగల కోసం వృద్ధురాలిని హత్య చేసిన పనిమనిషి - నగల కోసం వృద్ధురాలి హత్య
నమ్మి పనిలో పెట్టుకున్నందుకు ఓ పని మనిషి ఘాతుకానికి పాల్పడింది. యజమానురాలైన వృద్ధురాలిని చంపి.. పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. హైదరాబాద్ కాచిగూడలో శనివారం ఈ ఘటన వెలుగుచూసింది.
నగల కోసం వృద్ధురాలి హత్య
శనివారం ఉదయం ఇంట్లో కమలమ్మ నిద్రిస్తున్న స్థితిలో ఉండటాన్ని స్థానికులు చూశారు. తట్టిలేపేందుకు ప్రయత్నించినా లేవపోవటం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చి పోలీసులు పరిశీలించారు. వృద్ధురాలి చేతికి ఉండాల్సిన బంగారు గాజులు, బీరువాలోని నెక్లెస్, మొత్తం పది తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేలు కనిపించలేదు. కమలమ్మ ముఖంపై దిండుతో అదిమి చంపేసి.. అనంతరం నగలు, నగదుతో పనిమనిషి లక్ష్మి పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.