ఇంటర్మీడియట్ బోర్డ్ ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో తార్నాకలో ఎమ్మెల్సీ రామచంద్ర రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఉదయమే ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు.. బయటకు రాకుండా అడ్డుకున్నారు.
తార్నాకలో ఎమ్మెల్సీ రామచంద్రరావు గృహనిర్బంధం - BJP
ఇంటర్ బోర్డ్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ఇంటర్ బోర్టు ముట్టడికి నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడి వారికి అక్కడే అదుపులోకి తీసుకొని గృహనిర్బంధంలో ఉంచుతున్నారు.
తార్నాకలో ఎమ్మెల్సీ రామచంద్రరావు గృహనిర్బంధం
పోలీసుల తీరుపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హౌస్ అరెస్టు చేయడం అమానుషమని... ఇంటర్ అవకతవకలకు బాధ్యులను గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.