ఈ ఏడాది హలీం ప్రియులకు నిరాశే! - No Haleem in Hyderabad this year due to corona
హలీం.. పేరు వినగానే నోరూరుతుంది. రంజాన్ సమయంలో బారులు తీరిన కొనుగోలుదారులతో ఆయా దుకాణాల్లో సందడి నెలకొంటుంది. విదేశాలకూ ఎగుమతి చేస్తుంటారు. నగరంలో నిజాం కాలంలో పరిచయమైన ఈ వంటకం ఏటా రూ.కోట్లలో వ్యాపారంతో వందల మందికి ఉపాధిగా మారింది.
![ఈ ఏడాది హలీం ప్రియులకు నిరాశే! Hotel owners disclose that there is no halim maker in Hyderabad in the wake of corona virus outbreak.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6906961-6-6906961-1587633609994.jpg)
ఈ ఏడాది హలీం రుచులు లేనట్టే!
ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో హలీం తయారీని ఈ ఏడాది నిలిపేస్తూ హైదరాబాద్లో హోటళ్ల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఇళ్లకే సరఫరా చేసేలా తయారు చేద్దామనుకున్నా లాక్‌డౌన్ పొడిగింపు, ఆహార ఉత్పత్తుల సరఫరాపై ప్రభుత్వ నిషేధంతో హలీం తయారీ నిలిపేయాలని నిర్ణయించినట్లు చార్మినార్‌లోని పిస్తా హౌజ్ నిర్వహకుడు ఎం.ఎ.మాజిద్ తెలిపారు.