హైదరాబాద్ మహానగరంలో విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల నుంచి యువకులు, విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు వసతిగృహాల్లో ఉంటున్నారు. కరోనా వైరస్ కారణంగా అన్ని పరిశ్రమలు, సంస్థలు సెలవులు ప్రకటించాయి. ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించాయి. ఉద్యోగాలు, ఉన్నత చదువుల్లో శిక్షణ కోసం కూడా వేల సంఖ్యలో యువత నగరంలో ఉంటున్నారు.
ఎలాంటి వాస్తవం లేదు...
కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న తరుణంలో వసతిగృహా నిర్వాహకులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో వసతిగృహాలు ఖాళీ చేయిస్తున్నమనటంలో ఎలాంటి వాస్తవం లేదని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ వసతి గృహాలు తెరిచే ఉంచుతామని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగుల తల్లిదండ్రులు ఆందోళన చెందాలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వసతిగృహాలను తెరిచే ఉంచుతాం: నిర్వాహకులు ఇదీ చూడండి:నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ