హైదరాబాద్ మాదాపూర్లోని పత్రికానగర్లో ఉన్న ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ప్రహరీ కూలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హాస్టల్ పక్కన భవన నిర్మాణం కోసం సెల్లార్ గోతులు తవ్వుతుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు.
'హాస్టల్ గోడ కూలి ముగ్గురికి తీవ్రగాయాలు' - Ladies Hostel Wall Fell Down
ఓ లేడీస్ హాస్టల్ గోడ కూలి ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన హైదరాబాద్ మాదాపూర్లో జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Hostel Wall Collapse
గాయపడిన వారిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హాస్టల్లో ఉన్న 70 మందిని జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి :కారు నుజ్జు నుజ్జు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫ్యామిలీ సేఫ్.!
TAGGED:
Ladies Hostel Wall Fell Down