ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహాన్ని మార్చురీలో ఉంచేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఘటన వెలుగు చూసింది. మలక్‌పేటకు చెందిన మాజిద్ అనే వ్యక్తి నిన్న రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. రాత్రి సమయంలో పోస్ట్‌మార్టం చేయని కారణంగా మార్చురీలో ఉంచాలని మృతుడి కుటుంబసభ్యులు కోరారు.
అందుకు రూ.1000 లంచంగా ఇవ్వాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న రాజు డిమాండ్ చేశాడు. దీంతో వారు ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఉన్నాతాధికారులు రాజు విధుల్లో ఉన్నప్పుడు మద్యం సేవించడం, లంచం డిమాండ్ చేశాడని తేలింది. పూర్తిస్థాయి విచారణ జరిపిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నాగేంద్ర.. రాజును సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.