తార్నాకలో ఉండే ఇద్దరు ఉన్నతోద్యోగులు రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ పీహెచ్‌సీలో రెండో డోస్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. సుమారు 50 కి.మీలు ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికెళ్తే సమయం మించిపోయిందంటూ తిప్పి పంపించారు. తర్వాత ‘వాక్సినేషన్ కంప్లీటెడ్’ అంటూ ఎస్‌ఎంఎస్ రావడంతో ఆ ఇద్దరు కంగుతిన్నారు. మరుసటి రోజు మళ్లీ వెళ్లినా సిబ్బంది ఒప్పుకోలేదు. ఈ ఇద్దరే కాదు.. చాలా మంది ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
చివరి నిమిషంలో హడావుడిగా...
గ్రేటర్ పరిధిలోని వ్యాక్సినేషన్ సెంటర్లలో స్లాట్స్ దొరకడం లేదు. కాస్త దూరమైనా సరే.. తప్పనిసరి పరిస్థితుల్లో నగరవాసులు రంగారెడ్డి జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాల్లో బుక్ చేసుకుంటున్నారు. కొన్ని సెంటర్లలోని డాటా ఎంట్రీ ఆపరేటర్ల తీరు ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులంతా వ్యాక్సిన్ తీసుకోకపోయినా తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆ స్థానంలో పరిచయస్థులకు సూది మందు వేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.