Horse Racing at AOB: ఒకప్పుడు నిత్యం పోలీసుల కాల్పులతో, తుపాకీ శబ్దాలతో, మావోయిస్టుల దాడులతో ప్రశాంతత లేకుండా ఉండే ప్రాంతం ఆంధ్రా-ఒడిశా సరిహద్దు. ఈ ఏరియాలో ఒడిశా ప్రభుత్వం మొట్ట మొదటి సారి దేశీ గుర్రపు స్వారీ పోటీలను నిర్వహించింది. ఒకప్పుడు మావోల దాడులు వివిధ కార్యకలాపాలతో వార్తలో ఉండే కట్ ఆఫ్ ఏరియాలో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోంది. స్వాభిమన్ ఏరియాలో గురుప్రియ వంతెన నిర్మాణం తరువాత దాదాపు 20 వేల మంది ప్రజలకు రాకపోకల కష్టాలు నెరవేరడంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గల కట్ ఆఫ్ ఏరియాలో ఒడిశా ప్రభుత్వం మొట్టమొదటి సారి దేశీ గుర్రపు స్వారీ పోటీలను నిర్వహించింది.
ఏవోబీలో కోలాహలంగా గుర్రపు స్వారీ పోటీలు.. ఆనందంలో గిరిజనులు
Horse Racing at AOB: ఒకప్పుడు నిత్యం పోలీసుల కాల్పులతో, తుపాకీ శబ్దాలతో, మావోల దాడులతో ప్రశాంతత లేకుండా ఉండే ప్రాంతం అది. ప్రస్తుతం ప్రజల ఆనందంతో నిండిపోయింది. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటనే కదా మీ డౌట్ అదే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు. ఎప్పుడూ మావోయిస్టుల దాడులతో వార్తల్లో నిలిచే ఈ ప్రాంతం ఇప్పుడు కొత్తగా గుర్రపు పందాల వార్తతో పలకరించింది.
మల్యవంత దినోత్సంలో భాగంగా ఒడిశా ప్రభుత్వం స్వాభిమాన్ అంచల్లో గల పప్పర్మెట్ల పంచాయతిలో నిర్వహించిన గుర్రపు పందాలలో ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల నుంచి 30 మంది ఔత్సాహికులు ఈ పోటీలలో పాల్గొన్నారు. గుర్రపు పోటీలను తిలకించేందుకు గిరిజనలు భారీగా తరలివచ్చారు. ఒకప్పుడు తమ నిత్యావసరాలు గ్రామాలకు చెరవేసుకునేందుకు వినియోగించే గుర్రాలను ఇలా గుర్రపు పోటీలకు వినియోగించడం చాలా ఆనందంగా ఉందని పోటీదారులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే అధికారులు కూడా ఉత్సవాల్లో గుర్రపు పందాలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: