తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ వారం మీ జాతకం ఎలా ఉండబోతోందో తెలుసా?

గతవారం మీకు ఆశించిన ఫలితాలు రాలేదా...? ఇప్పుడూ అదే సమయం కొనసాగనుందా? గడిచిన వారం ఎంతో సంతోషంగా గడిచిందా... అయితే అవే క్షణాలు ఈ వారమూ మీలో నూతనోత్సాహాన్ని నింపనున్నాయా? 15వ తేదీ నుంచి 21 వరకూ మీ రాశులు, మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వనున్నాయో తెలుసుకొండి మరి..

horoscope-of-15th-December-to-21th-December
ఈ వారం మీ జాతకం ఎలా ఉండబోతోందో తెలుసా?

By

Published : Dec 15, 2019, 11:04 AM IST

Updated : Dec 15, 2019, 12:21 PM IST

మేషం:

వారం ప్రారంభంలో కుటుంబం, స్నేహితులతో చక్కని సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో చేపట్టే అన్ని పనులు అనుకూలంగా సాగుతాయి. పోటీదారులకు గట్టిపోటీ ఇస్తారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో శాంతి నెలకొని ఉండేందుకు మీరు ప్రశాంతంగా ఉండండి. ఊహించని న్యాయ వ్యవహరాలు లేదా ప్రభుత్వ లావాదేవీలపై మీరు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన తగాదాల్లో మీకు నిరాశ ఎదురయ్యే సూచనలున్నాయి. ప్రేమించే వ్యక్తితో మీ కమ్యూనికేషన్ పెరుగుతుంది. వారం చివర్లో ఆదాయవనరులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. నరాలు లేదా చర్మ సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. సానుకూల జీవితం గడిపేందుకు నాది అనే భావనను, అవాస్తవిక అంచనాలు, దుఃఖం, ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టాలి. చదువుల్లో ఆశించిన ఫలితాలు పొందేందుకు విద్యార్థులు మరింత కృషి చేయాల్సి ఉంటుంది.

వృషభం:

ఆఫీసులో ముఖ్యమైన విషయమై సీనియర్లతో చర్చలు జరుపుతారు. పోటీదారులకు గట్టి పోటీ ఇస్తారు. స్టాక్ బ్రోకింగ్ లేదా ఏజెన్సీ వంటి పనుల్లో ఉన్నవారికి ఈ వారం లాభదాయకం. మీ వ్యాపారం రాణిస్తుంది, ఉద్యోగిగా మీరు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు, పదోన్నతి పొందే సూచనలూ ఉన్నాయి. మీ భార్య, సంతానం మీ సంతోషాన్ని పెంచుతారు. ఈ సమయంలో మీ భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. అంతా కలిసి బయటకు వెళ్లడం లేదా విందు భోజనం చేస్తారు. ఈ సమయంలో ఒక శుభకార్యానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. మానసిక, శారీరక ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. కాని వారం చివరి రోజు జాగ్రత్తగా ఉండాలి. జీవితభాగస్వామిపై మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సర్దుకుపోతే సంబంధాల్లో కొత్త ఆనందాన్ని చూస్తారు.

మిధునం:

సృజనాత్మక ఆలోచనలకు సీనియర్ల నుంచి ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. అంతే కాదు కొన్ని ముఖ్యమైన పనుల విషయమై మీతో చర్చిస్తారు. కీలకాంశాలపై కుటుంబ సభ్యులతో స్వేచ్ఛతో మాట్లాడతారు. కొత్త ఫర్నీచర్, షో-పీసులు లేదా అలంకరణ వస్తువులు కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం పర్యటన చేస్తారు. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు మీకు చేకూరుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది, స్టాక్‌ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, వెండి లేదా ఆస్తుల్లో పెట్టుబడి గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలం. వారం చివర్లో విద్యార్థులు చదువులపై మరింత దృష్టి సారించాలి. కెరీర్‌కు సంబంధించిన సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టైతే బరువైన వస్తువులు ఎత్తకండి, జాగ్రత్తగా ఉండండి.

కర్కాటకం:

తోబుట్టువులతో మీ సంబంధాలు ఈ వారం ప్రారంభంలో మెరుగుపడతాయి. సామాజిక కార్యక్రమాలపై డబ్బు ఖర్చు చేస్తారు, అది మీకు చక్కని సంతృప్తిని ఇస్తుంది. వ్యాపారుల ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మీ జాతక చక్రం ప్రకారం మీరు కొన్ని సమస్యల్లో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కోపం, బాధ, ఒత్తిడి, అనారోగ్యం వంటివి మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ప్రయాణాలు చేయకండి, శారీరకంగా శ్రమ ఉండే ఆటలు కూడా ఆడవద్దు, ప్రమాదం చోటుచేసుకోవడం లేదా ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. ఈ వారం మీలో భక్తి భావం కనిపిస్తుంది. ఏదైనా కొత్తది ప్రారంభించాలనే ఆలోచన మీకు కలుగుతుంది, అయితే హడావుడిగా నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది, కొత్తవి నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది.

సింహం:

మీ కఠిన శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విజయాన్ని ప్రేమించే వ్యక్తులతో కలిసి ఆస్వాదిస్తారు. అలంకరణ, పెయింటింగ్, ఇంటి మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. హడావుడి జీవితం నుంచి ఉపశమనం కోసం కొంత ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తారు. అది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, సంతోషం కలుగుతుంది. అదృష్టం మీకు అండగా ఉంటుంది. విదేశాల్లో ఉంటున్న బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్తే మీకు మనశ్శాంతి లభిస్తుంది. వారంలో మొదటి రోజు మినహ మిగిలిన రోజులన్నీ మీరు కుటుంబంతో చక్కని సమయం గడుపుతారు. విద్యార్థులపై ప్రాజెక్టు వర్క్ భారం పడుతుంది. ఈ వారం ద్వితీయార్థంలో మీ ఆదాయ వనరులు పెరుగుతాయి.

కన్య:

ఈ వారం మీరు ఆర్థికంగా లబ్ది పొందుతారు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలూ అందుకుంటారు. దుస్తులు, ఆభరణాలు, వాహనం లేదా ఖరీదైన వస్తువుల కొనుగోలుకు డబ్బు ఖర్చు చేస్తారు. ప్రేమించే వ్యక్తిని కలుసుకోవడం మీలో సంతోషాన్ని నింపుతుంది. మీ వైవాహిక జీవితంలో గొప్ప సాన్నిహిత్యాన్ని చూస్తారు. కోపం, ప్రతికూల ఆలోచనలు చుట్టుముడతాయి కాబట్టి 17, 18 తేదీల్లో జాగ్ర్తత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. చిన్న విషయాలపై కుటుంబంలో ఘర్షణలు చోటుచేసుకుంటాయి. ఖర్చులు పెరిగే కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ కష్టాలు కొంత సమయంలోనే తీరిపోతాయి. ఏదైనా కొత్తది ప్రారంభించాలనే ఉత్సాహం మీలో కలుగుతుంది. అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతి ఆశించవచ్చు. ఈ నెల 17, 18 తేదీలు మినహా మిగిలిన రోజులు విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ఆరోగ్యపరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటారు.

తుల:

జీవితంలో సమస్యలు వస్తాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలనే విషయాన్ని గ్రహించాలి. ప్రశాంతంగా, సహనంతో ఉండాలి. సులభంగా డబ్బు అందిస్తామని చెప్పే స్కీములకు దూరంగా ఉండాలి. వృత్తిజీవితంలో చురుగ్గా ఉంటారు. మీ సంభాషణ నైపుణ్యం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం 19, 20 తేదీల్లో మీరు ఎవరితోనూ వాదనలకు దిగకండి. హడావుడి నిర్ణయాలు మీకు లాభం చేకూర్చవు. తెలివితేటలు పెంచుకొని, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మీలో పెరుగుతుంది. మీరు సాధారణంగా ఆధ్యాత్మిక కలిగి ఉండరు కాని, ఈ విషయాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఆదాయంలో పెరుగుదల కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. సరైన ప్రణాళికతో మీరు ఏదైనా ఆలోచన చేస్తే అందులో విజయం సాధిస్తారు.

వృశ్చికం:

గత వారపు అలసట, బద్ధకాన్ని వదిలిపెడతారు, ఈ వారం కొత్త ఉత్సాహం మీలో తొణికిసలాడుతుంది. ఆదాయం పెంచుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. సరైన ప్రణాళికతో కెరీర్ పరంగా ముందుకు వెళ్తారు. అపోహలు చోటుచేసుకోకుండా ఉండేందుకు సంభాషణల్లో స్పష్టంగా ఉండండి, మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోకుండా చూసుకోండి. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఈ వారం చివరి రోజు అలసటకు గురైనట్టు మీకనిపిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడంతో మీలో శక్తి తగ్గుతుంది. ఇతరులు నవ్వుతూ ఉండేలా చూసేందుకు మీరు ప్రయత్నిస్తారు, అది మీకు సంతృప్తి కలుగజేస్తుంది. ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది.

ధనుస్సు:

ఈ వారం మీకు అత్యంత ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం విషయమై ఈ వారం మొదటి రెండు రోజులు ఖర్చులు ఉంటాయి. ప్రతికూల ఆలోచనల ప్రభావం మీపై అధికంగా ఉంటుంది, కాబట్టి ఈ వారం మీరు దృఢంగా ఉండాలి. మానసికంగా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అంత సహకరించదు. విసుగు, బద్ధకం కలుగుతాయి. విజయం సాధించేందుకు బాగా కష్టపడాలి. విదేశాల్లో ఉంటున్న బంధువుల నుంచి శుభవార్త వింటారు. తీర్థయాత్ర చేపడతారు. మీ సీనియర్లు మీ పనిని ప్రశంసిస్తారు. ఆత్మవిశ్వాసం, అంకితభావంతో మీరు పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి. తండ్రితో మీ అనుబంధం సజావుగా ఉంటుంది. స్థలం, వాహనం, ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేసేందుకు ఈ వారం అనుకూలంగా ఉంది. మీ వైవాహిక జీవితం మధురంగా సాగుతుంది.

మకరం:

మీ ప్రేమ జీవితం మధురంగా సాగుతుంది. కుటుంబ జీవితంగా సాఫీగా సాగుతుంది, కుటుంబసభ్యులతో చక్కని సమయం గడుపుతారు. ఆరోగ్యం మీకు అండగా ఉంటుంది, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే దాన్నుంచి ఈ వారం ఉపశమనం లభిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. సీనియర్లు, తోటి ఉద్యోగులు మీకు సహకరిస్తారు. పోటీదారులకు గట్టి పోటీ ఇస్తారు. వ్యాపార విస్తరణ కోసం మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. సామాజికంగా మీరు ఉన్నత స్థితిలో ఉంటారు. విద్యార్థులకు చక్కని ఏకాగ్రతతో చదువుతారు. ఈ వారం మధ్యలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆ సమయంలో మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం :

నైపుణ్యాన్ని చూపి విజయం సాధించేందుకు గొప్ప అవకాశాలు ఈ వారం మీకు లభిస్తాయి, మీ సృజనాత్మకత, ఊహాశక్తి పెరుగుతాయి, రచనలు చేసేలా మీలో స్ఫూర్తిని కలిగిస్తాయి. ప్రేమించే వ్యక్తిని కలుసుకోవడం మీకు సంతోషం కలిగిస్తుంది. సంబంధాలు నిలుపుకొని ఉంచుకోవడంలో మరింత కృషి చేయాల్సి ఉంటుంది. మీ ప్రేమ జీవితానికి ఈ వారం మధ్యలో అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈ వారం 19, 20 తేదీలు కొంత సంక్లిష్టంగా ఉన్నాయి. పిల్లల పురోగతి విషయంలో ఆందోళనకు గురవుతారు. విద్యార్థులు చదువులకు మరింత సమయం కేటాయించాల్సి ఉంటుంది. మాయలు, రహస్య విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ వారంలో 19, 20 తేదీల్లో మీరు భావోద్వేగంతో ఉంటారు కాబట్టి కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు వాదనలకు దిగకండి, ప్రశాంతంగా ఉండండి. ఈ వారం మీ మానసిక, శారీరక ఆరోగ్యం విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు.

మీనం :

ఎగుమతి/దిగుమతి వ్యాపారంలో ఉన్నట్టైతే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. విద్యార్థులకు ఈ వారం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఏదైనా కొత్తది ప్రారంభించే ఆలోచనలో ఉంటారు. తప్పుడు ఒప్పందాలు, అంచనాల విషయంలో స్పష్టతో ఉండండి. మీ సీనియర్ల ముందు మిమ్మల్ని అవమానించేందుకుమీ పోటీదారులు ప్రయత్నిస్తారు, కాని మీ బలమైన వ్యక్తిత్వం, అంకితభావం కారణంగా వారు విఫలమవుతారు. ఈ వారం ద్వితీయార్థంలో జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది, కాని చివరి రోజు మాత్రం కొంత సంక్లిష్టభరితంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మీరు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. క్రమపద్ధతి లేని మీ రోజువారీ పనులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వాహనం లేదా స్థలం కొనుగోలుపై మీరు డబ్బు ఖర్చు చేసే సూచనలున్నాయి.

Last Updated : Dec 15, 2019, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details